అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్న బ్లూమ్‌బెర్గ్

రాజకీయాలంటే మామూలు విషయం కాదు కాదా… ఇక్కడ గెలవాలంటే ప్రజల మద్ధతుతో పాటు డబ్బు కూడా కావాల్సిందే.అమెరికా నుంచి అనకాపల్లిలోని గల్లి రాజకీయాల వరకు కాసులదే కీలకపాత్ర.

 Michael Bloomberg Spent Dollors 120mn On Ads In Presidential Race-TeluguStop.com

ఇక ఈ సంగతి పక్కనబెడితే.అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రిపబ్లికన్లు.ఎలాగైనా ఒడిసిపట్టాలని డెమొక్రాట్లు పావులు కదుపుతున్నారు.

ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటిపడుతున్న బిలియనీర్, మాజీ న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ కోట్లు కుమ్మరిస్తున్నారు.డెమొక్రాటిక్ పార్టీ నుంచి బరిలో నిలిచిన ఆయన వివిధ టీవీ ఛానెల్స్‌లో ప్రకటనల కోసం గత నెల నుంచి ఇప్పటి వరకు సుమారు 120 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు.50 రాష్ట్రాలపైనా బ్లూమ్‌బర్గ్ ఖర్చు పెడుతున్నప్పటికీ.ఎక్కువగా కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి కీలక రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

Telugu Mayor York, Mn Dollors-

నవంబర్ చివరి నుంచి సుమారు మూడు వారాల్లో మాజీ మేయర్ ప్రకటనల కోసం చేసిన ఖర్చు… ఈ ఏడాది మొత్తం డెమొక్రాటిక్ అభ్యర్థులు చేసిన ఖర్చు కంటే రెట్టింపని పొలిటికో నివేదిక తెలిపింది.అధ్యక్ష రేసులో ఇంతటి వ్యయాన్ని తాము గతంలో ఎప్పుడూ చూడలేదని రిపబ్లికన్ రాజకీయ వ్యూహకర్త జిమ్ మెక్‌లాఫ్లిన్ వ్యాఖ్యానించారు.కాగా గతవారం క్విన్నిపియాక్ యూనివర్సిటీ విడుదల చేసిన సర్వే ప్రకారం డెమొక్రాటిక్ ప్రాథమిక రేసులో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ 30 శాతం ఓట్లతో అందరికంటే ముందున్నారు.ఆయన తర్వాత 17 శాతం ఓట్లతో సెనేటర్ ఎలిజబెత్ వారన్, బ్లూమ్‌బర్గ్ 7 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube