అభిశంసనపై దర్యాప్తు‌లో కీలకపాత్ర: ఇంటెలిజెన్స్ అధికారిపై ట్రంప్ వేటు

గతేడాది జరిగిన తన అభిశంసన ప్రక్రియకు సంబంధించి దర్యాప్తులో పాల్గొన్న ఇంటెలిజెన్స్ అధికారిపై వేటు వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు.ఈ విషయాన్ని శుక్రవారం ఆయన కాంగ్రెస్‌కు తెలియజేశారు.

 Us President Donald Trump,intelligence Official,  Impeachment Probe, Nri, Democr-TeluguStop.com

అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటికి చెందిన ఇన్స్‌పెక్టర్ జనరల్‌ మైఖేల్ అట్కిన్సన్‌ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ కీలకమైన చట్టసభ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై తనకు పూర్తి విశ్వాసం ఉండటం అత్యవసరమని ఈ సందర్భంగా ట్రంప్ ప్రస్తావించారు.30 రోజుల్లో మైఖేల్ తన పదవిని కోల్పోతారని అధ్యక్షుడు స్పష్టం చేశారు.ఇదే సమయంలో కెరీర్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్‌గా వున్న థామస్ మోన్‌హీమ్ తాత్కాలిక ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా పనిచేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

మైఖేల్‌ అట్కిన్సన్‌ను ట్రంపే ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజన్స్‌గా నియమించారు.అయితే 2020 అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రయోజనం కోసం ట్రంప్ ఉక్రెయిన్ జోక్యాన్ని కోరే ప్రయత్నం చేశారని.

అందుకు తన అధికారిక కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని విజిల్‌బ్లోయర్ నివేదిక ఆరోపించింది.దీనిని అట్కిన్సన్‌ నమ్మదగినదిగా నిర్థారించడం అప్పట్లో సంచలనం కలిగించింది.

Telugu Democratic, Jo Biden, Donald Trump-

జూలై 25 ఫోన్ కాల్ సందర్భంగా డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన జో బిడెన్ అతని కుమారుడిని విచారించాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీ‌పై ఒత్తిడి తెచ్చినట్లు అభియోగం.ఈ చర్య ద్వారా ట్రంప్ అమెరికా జాతీయ భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్‌ను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అట్కిన్సన్‌ ఆందోళన చెందారు.వివాదాస్పదమైన పక్షపాత విచారణ తర్వాత డెమొక్రాటిక్ పార్టీ మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్‌ను అభిశంసించడానికి ఓటు వేసింది.అయితే రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న సెనేట్ ఫిబ్రవరి ఆరంభంలో ట్రంప్‌ను ఆయా అభియోగాల నుంచి నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌పై వేటు వేసేందుకు ట్రంప్ సిద్ధపడటంపై డెమొక్రాట్లు ఆయనపై విమర్శలు గుప్పించారు.జాతీయ అత్యవసర పరిస్ధితుల మధ్య తన విధిని తాను నిర్వహించినందుకు మరొ ఇంటెలిజెన్స్ అధికారిని తొలగించడం ద్వారా ట్రంప్ మరోసారి ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ యొక్క సమగ్రతను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని డెమొక్రాటిక్ సెనేటర్ మార్క్ వార్నర్ మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube