రైతు ఉద్యమానికి సపోర్ట్ చేసిన మియా ఖలీఫా.... దాంతో నెటిజన్లు...

మియా ఖలీఫా.ఈ పేరు వినగానే అందరికీ మొదటగా ఈమె శృంగార తార అని గుర్తొస్తుంది.

 Mia Khalifa Reiterates Support For Farmers   Mia Khalifa Reiterates Support For-TeluguStop.com

అయితే ఇది ఒకప్పటి మాట.మియా కలీఫా తన కుటుంబ అవసరాల నిమిత్తం శృంగార చిత్రాలలో నటించినప్పటికీ ప్రస్తుతం అలాంటి చిత్రాల్లో నటించడం మానేసి చాలా గౌరవంగా జీవిస్తోంది.అంతేగాక పలు ఎన్జీవో మరియు ఆర్గనైజేషన్స్ తో కలిసి మంచి పనులను కూడా చేస్తోంది.కాగా తాజాగా మియా ఖలీఫా భారతదేశంలో కొత్తగా అమలు చేస్తున్న రైతు చట్టాలను తొలగించాలంటూ చేపట్టిన రైతు ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు గాను సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇటీవలే మియా ఖలీఫా రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఉద్యమం చేస్తున్న రైతుల ఫోటోలను ట్యాగ్ చేస్తూ రైతుల చేతుల్లో ఏలాంటి మరణాయుధాలు లేవని, అలాంటప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేశారంటూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రశ్నించింది.దీంతో కొందరు నెటిజన్లుమియా ఖలీఫా గతంలో చేసిన పనులు మరియు తన వ్యక్తిగత విషయాలపై అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారు.

 అంతే గాక మరి కొంతమంది రాజకీయ నాయకులయితే ఏకంగా మీకు రైతుల గురించి మరియు ఇక్కడి పరిస్థితుల గురించి ఏమాత్రం తెలియదని కాబట్టి స్పృహలో ఉండి మాట్లాడాలని కామెంట్లు చేస్తున్నారు.

దీంతో మియా ఖలీఫా మరోమారు ఈ విషయంపై స్పందిస్తూ తానేమీ నిద్రపోతూ మాట్లాడడం లేదని స్పృహలోనే ఉండి అన్నీ తెలిసే రైతు ఉద్యమానికి తన మద్దతు తెలియజేస్తున్నానని చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది.

దీంతో మియా ఖలీఫా చేసినటువంటి ఈ పనికి కొందరు నెటిజన్లు తమ మద్దతుని తెలియజేస్తున్నారు.అంతేగాక పబ్లిక్ వ్యవహారాలలో వ్యక్తిగత విషయాల గురించి మరియు మనోభావాలు దెబ్బతినే విధంగా ఓ మహిళపై కామెంట్లు చేసిన రాజకీయ నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనప్పటికీ చిన్న వానలా మొదలైనటువంటి రైతు ఉద్యమం రోజు రోజుకి ఉగ్ర రూపం దాల్చి సెంట్రల్ గవర్నమెంట్ పై ఒత్తిడి పెంచుతోంది.మరి భాజపా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube