భర్తతో రిలేషన్ కు ఎండ్ కార్డ్ వేసిన మియా ఖలీఫా.. కారణమేంటంటే?

ఈ మధ్య కాలంలో సినిమా సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.కొన్ని రోజుల క్రితం అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Mia Khalifa Announces Separation From Husband Robert Sandberg-TeluguStop.com

తాజాగా మియా ఖలీఫా భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు భారీ షాక్ ఇవ్వడం గమనార్హం.రెండు సంవత్సరాల రిలేషన్ షిప్ కు మియా ఖలీఫా శుభం కార్డు వేశారు.

శృంగార తారగా మియా ఖలీఫాకు ఉండే పాపులారిటీ అంతాఇంతా కాదు.

 Mia Khalifa Announces Separation From Husband Robert Sandberg-భర్తతో రిలేషన్ కు ఎండ్ కార్డ్ వేసిన మియా ఖలీఫా.. కారణమేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా భర్త రాబర్ట్ శాండ్ బర్గ్ నుంచి విడిపోతున్నానని మియా ఖలీఫా ప్రకటించడం గమనార్హం.

భర్తతో విడిపోతున్నందుకు తనకు బాధగా లేదని మియా ఖలీఫా తెలిపారు.భర్తతో తాను విడిపోయినా మంచి స్నేహితులలా ఉంటామని ఆమె వెల్లడించారు.విడిపోవడానికి ఇదే రీజన్ అని చెప్పలేనని ఒకరినొకరు గౌరవించుకుంటూ రిలేషన్ ను ఎండ్ చేస్తున్నామని మియా ఖలీఫా పేర్కొన్నారు.

Telugu Comments, Mia Khalifa, Mia Khalifa Dovorce, Negative Comments, Netizens, Pornstar, Robert Sandberg, Separation, Social Media-Movie

మియా ఖలీఫా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఈ పోస్ట్ గురించి పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మియా ఖలీఫాకు సోషల్ మీడియాలో సైతం భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఏడాది నుంచి తామిద్దరం కలిసి ఉండాలని ప్రయత్నాలు చేసినా వీలు కాలేదని మియా ఖలీఫా చెప్పుకొచ్చారు.

Telugu Comments, Mia Khalifa, Mia Khalifa Dovorce, Negative Comments, Netizens, Pornstar, Robert Sandberg, Separation, Social Media-Movie

ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడానికి కౌన్సిలింగ్ కూడా తీసుకున్నామని ఆమె అన్నారు.అయితే ఇద్దరి మనసులు కలవవని ఫిక్స్ అయ్యామని వేర్వేరుగా కొత్త లైఫ్ ను ప్రారంభిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.భర్తతో విడిపోయిన మియా ఖలీఫా మళ్లీ పెళ్లి చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.సెలబ్రిటీలు పెళ్లైన కొన్ని సంవత్సరాలకే తమ రిలేషన్ షిప్స్ ను బ్రేక్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

#Robert Sandberg #Comments #Mia Khalifa #Netizens #MiaKhalifa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు