ఉల్లిపాయ పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న అగ్ర రాజ్యం...!!!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి ఉంది.కానీ అగ్ర రాజ్యం అమెరికాకు మాత్రం ఈ సామెత నుంచీ మినహాయింపును ఇవ్వాల్సిందేమో ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం ఉల్లిపాయలు తింటున్న వారు ఆసుపత్రుల పాలవుతున్నారు.

 Mexico Onions Salmonella Virus , Americans, Salmonellosis, Onions, Center For Di-TeluguStop.com

అమెరికన్స్ వాడుతున్న ఉల్లిపాయల నుంచీ సల్మోనేల్లోసిస్ అనే వింత వ్యాధి వ్యాప్తిస్తోందట.ఇది క్రమ క్రమంగా విస్తరిస్తోందని నిపుణుల పరిసోధనల్లో తేలింది.

ఇప్పటికే పలు రాష్ట్రాలలో భారీగా కేసులు నమోదు అయ్యాయట.అసలు ఉన్న పళంగా ఇలాంటి వ్యాధి ప్రభాలడానికి కారణాలు ఏంటి అనే కోణంలో పరిశోధనలు చేపట్టిన నిపుణులకు ఇంట్లో వాడుతున్న ఉల్లిపాయలె కారణమని తేల్చి చెప్పారట.

అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (CDC ) వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఈ వ్యాధి వేగంగా విస్తరించిందని, దాదాపు 37 రాష్ట్రాలలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఇప్పటి వరకూ సుమారు 700 మందికి పైగా ఈ వ్యాధి సోకిందని, ఈ వ్యాధి తీవ్రత మరింత ముదిరితే పరిస్థితులు చేయిదాటే అవకాశాలు ఉన్నాయని CDC వెల్లడించింది.అసలు ఉల్లిపాయల నుంచీ ఈ వింత వ్యాధి సోకడం ఏంటి అనే కోణంలో పరిసోధిస్తున్న నిపుణులు సంచలన ప్రకటన చేశారు.

మెక్సికో నుంచీ దిగుమతి చేసుకున్న ప్రోసోర్ ఇంక్ సప్లై చేసిన ఉల్లిపాయల వలన ఇంత పెద్ద అనర్ధం జరిగిందని ఎట్టకేలకు అధికారులు గుర్తించారు.ఈ సప్లై చేసిన వాళ్ళు అమెరికా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఉల్లిపాయలు సప్లై చేశారని ఇవి ఎరుపు, తెలుపు రంగులలో ఉన్నాయని ఇలాంటి ఉల్లిపాయలు ఇంట్లో ఉంటె వెంటనే వాటిని తగులపెట్టేయాలని సూచించింది CDC.ఇలాంటి ఉల్లిపాయలు తినడం వలన వ్యాధి సోకిన వారికి జ్వరం, కడుపు నొప్పి, డయేరియా సోకుతాయని, ఇలాంటి లక్షణాలు ఉంటె తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని CDC సూచించింది.ఒక వేళ ఈ వ్యాధి సోకితే వైద్యుల వద్దకు వెళ్ళేలోగా ఎక్కువగా మంచి నీళ్ళు త్రాగాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube