311 మంది భారతీయులు వెనక్కి..ఎందుకంటే

అమెరికా బాటలో ఇప్పుడు మెక్సికో నడుస్తోంది.మెక్సికోలో ఉంటున్న భారతీయులలో సుమారు 311 మందిని అనేక కారణాలతో వెనక్కి పంపుతోంది.

 Mexico Has Deported 311 Undocumented Immigrants Back To India-TeluguStop.com

వీరందరూ అక్రమంగా ఉంటున్నారని, అక్రమ వలసలని ఇకపై ఉపెక్షించేంది లేదని తేల్చి చెప్తోంది.తాము వెనక్కి పంపిస్తున్న 311 మంది భారతీయులని ప్రత్యేక విమానంలో ఢిల్లీ పంపిస్తున్నట్టుగా తెలిపింది.

అమెరికాలోని అక్రమవలసదారులు ప్రవేసించేది అధిక శాతం మెక్సికో నుంచీ కావడంతో ఆగ్రహించిన అమెరికా మెక్సికో పై తీవ్ర స్థాయిలో మండిపడటంతో పాటు, తమనుంచీ ఎటువంటి సాయం పొందలేరని హెచ్చరించడంతో మెక్సికో కూడా వలసదారులపై ఖటినమైన వైఖరిని ప్రదర్శిస్తోంది.ఇదిలాఉంటే ఈ 311 మంది భారతీయులు వెనక్కి వస్తున్నట్టుగా భారత అధికారులు కూడా ధ్రువీకరించారు.


Telugu Airport, Mexico-

 

వీరందరూ సరైన ధ్రువపత్రాలు జతపరచకపోవడం వలన ఇదంతా జరిగిందని, అలాంటి వారి వివరాలు అన్నీ మాకు పంపారని భారత అధికారులు తెలిపారు.మెక్సికో సిటీ, కాలిఫోర్నియా .బాజా చిపాస్, వక్సాగా వంటి ప్రాంతాలలో అక్రమ వలస భారతీయులు ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube