ముచ్చట గొల్పుతున్న కుక్క, పావురం స్నేహం.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో కనిపించే జంతువుల వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఎన్నో క్యూట్ యానిమల్ వీడియోలు ప్రత్యక్షమై మనల్ని కట్టిపడేశాయి.

 Dog, Pigeon Friendship Video Viral Viral Latest, Viral News, Social Media, Dog-TeluguStop.com

నిజానికి ప్రతి రోజు జంతువులకు సంబంధించి చాలా వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.అయితే తాజాగా కూడా ఒక వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో కుక్క, పావురం స్నేహం చేస్తూ కనిపించాయి.ఈ రెండు పెంపుడు జీవులూ ఒకే దగ్గర నిద్రపోతూ కనిపించి నెటిజన్లను ఫిదా చేశాయి.

అంతేకాదు, ఈ వీడియోలో మంచంపై పడుకున్న కుక్క పక్కనే ఒక పావురం అల్లరి చేయడం చూడొచ్చు.ఆ పావురం కుక్క పాదాలను తాకుతూ ఎలాంటి భయం లేకుండా ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఎవరైనా ఫిదా కావాల్సిందే.

గమ్మత్తేమిటంటే, పడుకున్న తనని పావురం డిస్టర్బ్ చేసినా.కుక్క మాత్రం కొంచెం కూడా కోపం ప్రదర్శించలేదు.

పావురం చేస్తున్న చిలిపి చేష్టలను భరిస్తూ కుక్క తన స్నేహాన్ని చాటుకుంది.

వీడియో చూస్తే ఈ రెండు జీవులు ఎంత మంచి స్నేహితులో ఇట్టే అర్థమైపోతుంది.

నెటిజన్లు సైతం కుక్క, పావురం మధ్య స్నేహం చూసి ముచ్చట పడుతున్నారు.పావురం కుక్కను విసిగించిన తీరు చూసి తెగ నవ్వుకుంటున్నారు.స్నేహమంటే ఇదేరా, స్నేహం కోసం అంటూ భారీ లెవల్లో కామెంట్లు కూడా చేస్తున్నారు.

అయితే ఈ అద్భుతమైన వీడియోను ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దాంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.జంతువులే అయినప్పటికీ వాటికి కూడా స్నేహానికి విలువిచ్చే గొప్పతనం ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.మాట్లాడలేవు కానీ మనుషుల్లాగే జంతువులు కూడా అన్నీ భావాలను అర్థం చేసుకుంటారని కొందరు కామెంట్లు పెడుతున్నారు.ఎటువంటి హాని తలపెట్టేకపోతే జంతువులు ఎవరి పై దాడి చేయమని.

ఆత్మరక్షణ కోసమే తిరగబడతారని నెటిజన్లు వివరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube