దేశంలో తొలిసారి ఇలా,వారి కోసం ప్రత్యేక మెట్రో స్టేషన్!

ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేకంగా ఒక మెట్రో స్టేషన్ ఏర్పాటు చేశారట.దేశంలో తొలిసారి ఇలా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటు చేశారు.

 Metro Station Specially For Transgenders In Noida, Metro Station, Transgenders,-TeluguStop.com

ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా ఢిల్లీ లోని నోయిడాలో.అక్కడ సెక్టార్ 50 స్టేషన్‌ను ట్రాన్స్ జెండర్స్ కోసం కేటాయించినట్లు తెలుస్తుంది.

ప్రత్యేక సౌకర్యాలతో ప్రయాణం చేసే వారికి, ఉద్యోగం చేసే వారికి అనుకూలమైన వాతావరణ అక్కడ ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు.దీనికి ‘రెయిన్ బో’ పేరును కూడా ఖరారు చేశారు.

ట్రాన్స్ జెండర్ల సమాజం, ఎన్జీవోల నుంచి వచ్చిన సలహాల ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశామని ఎండీ రీతూ మహేశ్వరి వెల్లడించారు.ట్రాన్స్ జెండర్ల సాధికారతకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇప్పటికే తమ సంస్థలో చాలా మందిట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అందుకే వారికి ప్రత్యేకంగా స్టేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే ట్రాన్స్‌జెండర్‌ స్టాఫ్‌ అందరినీ అక్కడికి బదలీ చేస్తామన్నామని, వారంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పారు.

అంతేకాక ఆ స్టేషన్‌లో ఎక్కే ట్రాన్స్‌జెండర్‌ ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయని తెలిపారు.అంతకు ముందు ‘షీ మ్యాన్’గా నామకరణం చేయగా అభ్యంతరాలు రావడంతో చివరకు ‘రెయిన్‌ బో’గా మార్చినట్లు తెలుస్తుంది.

మొత్తానికి ట్రాన్స్ జెండర్స్ కోసం ఈ వినూత్న ఆలోచన చేసి వారికి అన్ని వసతులు కల్పిస్తూ ఒక మెట్రో స్టేషన్ ను కూడా ఏర్పాటు చేయడం హర్షణీయం అని విశ్లేషకులు భావిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube