నేటి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో పరుగులు...!

కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కారణం చేత మెట్రో రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ప్రయాణికులకు ఆ ఇబ్బందులు తప్పాయి.

 Metro Train Services Resumes  After Covid-19 , Corona, Lockdown, Metro Services,-TeluguStop.com

ఎందుకంటే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మెట్రో రైలు సర్వీసు సేవలు ప్రారంభం అయ్యాయి.మళ్ళీ 169 రోజుల తర్వాత ఢిల్లీలో మెట్రో రైలు పరుగులు తీసింది.

అయితే అన్‌లాక్‌ 4 దశలో భాగంగా నేటి నుంచి ఢిల్లీ, నోయిడా, లక్నో, బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లో మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి.ఢిల్లీలో ఎల్లో లైన్‌లో సర్వీసులు నడుస్తున్నాయి.

సమయ్‌పుర్ బద్లీ నుంచి హుడా సిటీ వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్ర 4 నుంచి 8 వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయి.గురుగ్రామ్‌ లోని హుడా సిటీ సెంటర్ నుంచి హర్యానాలోని సమయ్‌పుర్ బద్లీ మెట్రో స్టేషన్‌కు తొలి రైలు కదిలింది.

కేవలం ఆన్‌లైన్‌, స్మార్ట్‌కార్డ్‌, క్యూఆర్ ‌కోడ్ టికెట్లతో మాత్రమే ప్రయాణికులకు అనుమతిస్తున్నారు.నోయిడా మెట్రో రైల్, అక్వా లైన్‌ లో మెట్రో పరుగులు తీస్తున్నది.లక్నో లోనూ మెట్రో సర్వీసులు ఇవాళ ఉదయం ఏడు నుంచి ప్రారంభం అయ్యాయి.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మెట్రో ప్రయాణికులకు ఎంట్రీ కల్పిస్తున్నారు.

అలాగే అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు టెంపరేచర్ చెక్ చేస్తున్నారు.

స్మార్ట్‌కార్డు ఉంటేనే ఎంట్రీ లేదంటే ఎగ్జిట్.

కరోనా దృష్ట్యా బుకింగ్ వద్ద టికెట్ కౌంటర్లు మూసివేశారు.బెంగుళూరు లోనూ మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి.

పర్పుల్ లైన్‌ లో మెట్రో పరుగులు తీస్తున్నది.ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు ప్రతి అయిదు నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుందని అధికారులు చెప్పారు.మెట్రో సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు స్వాగతం పలికింది.తన ట్విట్టర్ ఖాతాలో డీఎంఆర్‌సీ కొన్ని పోస్టులు చేసింది.బాధ్యతాయుతంగా ప్రయాణం చేయాలని, అవసరం అయితేనే ప్రయాణం చేయాలంటూ తన ట్వీట్‌ లో కోరింది.హైదరాబాద్ సర్వీసులు ప్రారంభం అయిన గాని కంటేన్మెంట్ జోన్లలో మాత్రం రైలు ఆగదు.

గాంధీ దవాఖాన, భరత్‌ నగర్‌, మూసాపేట, యూసఫ్ ‌గూడా మెట్రో స్టేషన్లను మూసివేశారు.ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి, లేదంటే జరిమానా విధిస్తున్నారు.

ప్రయాణికులు ఎవరికి వారు బాధ్యతాయుతంగా ఉండాలి. శానిటైజర్లు కూడా దగ్గర పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube