మీటూతో ప్రముఖుల బతుకులు రోడ్డు మీదకు  

  • బాలీవుడ్‌ హీరోయిన్‌ తనూశ్రీ దత్తా గత కొన్ని రోజులుగా నానా పటేకర్‌పై చేస్తున్న ఆరోపణలతో ఆమెకు అనూహ్యంగా మద్దతు పెరిగింది. ప్రముఖ నటుడు అయిన నానా పటేకర్‌ అలా చేయడం ఏమాత్రం పద్దతి కాదంటూ అంతా కూడా ఆయన్ను విమర్శలు చేస్తున్నారు. నానా పటేకర్‌ పై ఆమె చేసిన విమర్శల తర్వాత ఎంతో మంది మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను చెబుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోయిన్స్‌ ఇప్పటికే పలువురు ఫిల్మ్‌ మేకర్స్‌ బండారం బయట పెట్టారు.

  • Metoo Movement Gets A Voice In Bollywood-

    Metoo Movement Gets A Voice In Bollywood

  • తాజాగా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ సుభాష్‌ ఘయ్‌ తనను లైంగికంగా వేదించాడంటూ ముద్దుగుమ్మ కేట్‌ శర్మ సంచలన ఆరోపణలు చేస్తోంది. ఒక సినిమా విషయమై మాట్లాడాలి ఇంటికి రమ్మన్నాడు. నేను ఇంటికి వెళ్లిన సమయంలో అప్పటికే అక్కడ కొందరు ఉన్నారు. వారి ముందే నన్ను మసాజ్‌ చేయాల్సిందిగా కోరాడు. మొదట నిరాకరించిన నేను, సరేలో అనుకుని మర్ధన చేశాను, మర్దన చేసిన తర్వాత నేను వాష్‌ రూంకు వెళ్లిన సమయంలో నా వెనుకే వచ్చి కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు.

  • నా వెనుక వచ్చి కౌగిలించుకోవడంతో పాటు ముద్దు పెట్టుకునేందుకు సుభాష్‌ ఘయ్‌ ప్రయత్నించడంతో నేను ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించాను. నన్ను బలవంతంగా ఆపి రూంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. నాతో రాత్రంతా గడపాలని ఆయన డిమాండ్‌ చేశాడు. కాని నేను మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆయన నన్ను వేదించాడు. సినిమాల్లో ఛాన్స్‌ కోసం నేను అలాంటి పనులు చేయనంటూ తేల్చి చెప్పాను అంటూ కేట్‌ శర్మ చెప్పుకొచ్చింది.

  • Metoo Movement Gets A Voice In Bollywood-
  • మొత్తానికి బాలీవుడ్‌ ప్రముఖులు, మంచి పేరున్న వారు అంతా కూడా మీటూకు బలి అవుతున్నారు. ఇన్నాళ్లు మంచితనం ముసుగులో ఉన్న వారు ఇప్పుడు బయట పడుతున్నారు. అయితే ఎంత మంది ఆరోపణల్లో నిజాయితీ ఉందో, ఎంత మంది చేస్తున్న ఆరోపణలు నిజమో తెలియడం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.