మీటూ : ఆ టాప్ హీరోపై కేసు నమోదు !  

Metoo Effect Registered A Police Case Against Actor Arjun-

తనను లైంగికంగా వేధించారని, తన వెన్ను నిమిరి దగ్గరకు లాక్కున్నాడని సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ పై కన్నడ నటి శృతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న అర్జున్‌పై ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది. అర్జున్‌పై శనివారం శృతి పోలీసులకు ఫిర్యాదు చేశారు..

మీటూ : ఆ టాప్ హీరోపై కేసు నమోదు ! -Metoo Effect Registered A Police Case Against Actor Arjun

2015లో కన్నడ చిత్రం ‘విస్మయ’ షూటింగ్‌లో భాగంగా రిహార్సల్ చేస్తున్నప్పుడు అర్జున్ తనను అసభ్యకరంగా తాకారని వారం రోజుల క్రితం శృతి సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని తాజాగా తన ఫిర్యాదులో శృతి పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంపై హీరో అర్జున్ తరపున శృతిపై 5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీస్ కేసు పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. శృతి ఫిర్యాదును బెంగళూరులోని కుబ్బన్ పార్క్ పోలీసులు స్వీకరించారు.

ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అర్జున్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైందని డిప్యూటీ కమిషనర్ డి.దేవరాజ్ తెలిపారు.