హుజురాబాద్ ఉప ఎన్నికల కి ముందు బిజెపికి ఊహించని షాక్ ఇచ్చిన కీలక నేత..!!

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చాలా వరకు పోటీ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అన్న తరహాలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం నెలకొంది.

 Methkupalli Narasimhulu Resign To Bjp Party-TeluguStop.com

ఈ క్రమంలో.హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు బిజెపి పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు కీలక నాయకుడు.

మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాజకీయాలలో ప్రముఖ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు తాజాగా బిజెపి పార్టీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపారు.

 Methkupalli Narasimhulu Resign To Bjp Party-హుజురాబాద్ ఉప ఎన్నికల కి ముందు బిజెపికి ఊహించని షాక్ ఇచ్చిన కీలక నేత..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

,/br>

అంత మాత్రమే కాక త్వరలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు స్పష్టం చేశారు.తన రాజీనామా కి కారణం ఈటల రాజేందర్ నీ పార్టీలో జాయిన్ చేసుకోవడం అదే రీతిలో ఈటల వస్తున్నట్లు కూడా పార్టీ నాయకులు చెప్పకపోవడం అని అన్నారు.

ఈటల రాజేందర్ ఒక అవినీతి పరుడు అని దళితుల భూములను.అన్యాయంగా ఆక్రమించుకున్నారని.

కొన్ని వేల కోట్లు సంపాదించారు అని, అంత డబ్బు ఎలా వచ్చింది అని లేఖలో మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు.త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ నీ ఓడించడానికి దళితులు ఏకం కావాలని సూచించారు.

రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్నా గాని .తనని బిజెపి పార్టీ ఉపయోగించుకో లేదని, కనీసం బీజేపీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వకుండా కాలయాపన చేశారని బీజేపీ నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అదే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత ఈ సమావేశానికి బీజేపీ నాయకులను అడిగి వెళ్లడం జరిగిందని తన వల్ల వ్యతిరేక అభిప్రాయాలు.పార్టీలో రావటం తనని ఎంతగానో ఆవేదనకు గురి చేసిందని స్పష్టం చేశారు.

#Eatala Rajender #Telengana Bjp #Ts Poltics #Bandi Sanjay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు