తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక .. బంగాళాఖాతంలో అల్పపీడనం !  

telangana, hyderabad, heavy rains alert at telangana , Low pressure in the Bay of Bengal, Bay of Bengal, Department of Meteorology - Telugu Bay Of Bengal, Department Of Meteorology, Heavy Rains Alert At Telangana, Hyderabad, Low Pressure In The Bay Of Bengal, Telangana

తెలంగాణ లో కొద్దిరోజులుగా ఎడతెరపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ భారీ వర్షాల దెబ్బకి వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి.

TeluguStop.com - Meteorological Department Warns Telangana People

ఇప్పటికే తెలంగాణ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.మరో అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా ఉండబోతుందో వెల్లడించింది.

ఈనెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వాయుగుండం ఇప్పటికే అరేబియా సముద్రంలో కలిసిపోయిందని, భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది.19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు పడతాయని వివరించారు.పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వెంట ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్‌ ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని తెలిపింది.

దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరం మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని అధికారులు చెప్పారు.

TeluguStop.com - తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక .. బంగాళాఖాతంలో అల్పపీడనం -General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల నేడు శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.

.

#Hyderabad #Telangana #DepartmentOf #HeavyRains #Bay Of Bengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Meteorological Department Warns Telangana People Related Telugu News,Photos/Pics,Images..