ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. !

కరోనాతో సతమతం అవుతున్న ఏపీకీ తౌతే తుఫాను గండంలా వచ్చింది.అది తగ్గిపోయింది అని భావిస్తున్న తరుణంలో మరో తుపాను సిద్ధమైపోతుందట.

 Indian Meteorological Department Warns Ap On Yaas Cyclone, Meteorological Depart-TeluguStop.com

ఇక పగ బట్టినట్లుగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు కోవిడ్ సృష్టిస్తున్న కల్లోలంతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతుండగా ఈ వార్త పిడుగులా వినిపిస్తుందట.

ఇదిలా ఉండగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఈరోజు ఉదయమే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అది సోమవారం నాటికి తీవ్ర తుపాను ‘యాస్’ గా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది.

ఇలా ఏర్పడుతున్న యాస్ ఈ నెల 26 నాటికి పెనుతుపానుగా రూపుదిద్దుకుంటుందని వెల్లడించింది.కాగా అదే రోజు సాయంత్రం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు తాకే అవకాశాలున్నాయని తెలియచేసింది.

ఇక ఈ యాస్ తుఫాన్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో అత్యవసర సర్వీసులను, అన్ని రకాల ఔషధాలు, ఆరోగ్య సర్వీసులను సిద్ధం చేసుకోవాలని సూచిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube