నేడు, రేపు జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ కీలక ప్రకటన.. ఎందుకోసమంటే.. !

సామాన్యంగా శివరాత్రికి శివ శివ అంటూ చలి వెళ్లిపోతుందని అంటారు.కానీ ఇంకా శివరాత్రి కూడా వెళ్లలేదు.

 Meteorological Department Key Announcement-TeluguStop.com

అంతలోనే సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు.ప్రస్తుతం పగలంతా కొడుతున్న ఎండలను చూస్తుంటే ముదిరిన వేసవిలా కనిపిస్తుంది.

అప్పుడే ఊహించనంతలా ఎండ వేడి శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.ఇకపోతే ఎండ తీవ్రతపై తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగిపోయే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

 Meteorological Department Key Announcement-నేడు, రేపు జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ కీలక ప్రకటన.. ఎందుకోసమంటే.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా నేడు, రేపు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీల వరకు ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తుంది.

కాగా ఇందులో అగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల నేడు, రేపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇకపోతే గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, ఆదిలాబాద్‌లో 38 డిగ్రీలు, భద్రాచలంలో 38.5 డిగ్రీలు, ఖమ్మంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

#Increases #Department #Announcement #Sun Heat #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు