కోరుకున్న అమ్మాయిని చేరుకోవడం కోసం 247మంది అమ్మాయిలను వేడుకున్నాడు..247మందికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం..

ఒక అమ్మాయితో పరిచయం అయి మాటా మాటా కలిసాక, ఆ అమ్మాయి దూరం అయితే కొన్ని సార్లు లైట్ తీస్కుంటాం.కానీ ఆ అమ్మాయి మన మనసులో స్థానం సంపాదిస్తే మాత్రం.

 Met You Last Night You Gave Me The Wrong Number-TeluguStop.com

తన జాడ కనుక్కోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు.అదే విధంగా ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని కనుక్కోవడానికి ఏకంగా 247 మంది అమ్మాయిలను కదిపాడు.అసలు ఏం జరిగిందంటే…

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీలో క్యాంపస్ బార్‌లో కొన్నాళ్ల కిందట పార్టీ జరిగింది.ఈ పార్టీలో కార్లోస్ జెంతానా అనే యువకుడు నికోల్ అనే డచ్ యువతిని కలిశాడు.ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.

ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.అయితే నికోల్ మాత్రం గేమ్ ఆడింది.

కార్లోస్ జెంతానాకు తప్పు నంబర్ ఇచ్చింది.ఆ తర్వాత రోజు నికోల్‌తో మాట్లాడేందుకు కార్లోస్ ఫొన్ చేయగా ఆ నంబర్ తప్పని తేలింది.

దీంతో కార్లోస్ ఎలాగైనా ఆమె నెంబర్ కనుక్కోవాలని పట్టుబట్టి కూర్చున్నాడు.యూనివర్సటీ డిక్షనరీ వెతికి అందులో నికోల్ పేరుతో ఉన్న 247 మంది ఆడోళ్ల ఈమెయిల్ అడ్రస్‌లు తీసుకున్నాడు.


‘‘రాత్రి మనిద్దరం కలుసుకుని మాట్లాడుకున్నాం.నువ్వు నాకు ఫోన్ నంబర్ తప్పు ఇచ్చావు.నువ్వు నిజమైన నికోల్ వి అయితే స్పందించు.కానివారు దీనిని పట్టించుకోవద్దు.ఇదో సామూహిక మెయిల్’’ అని మొత్తం 247 మందికీ మెయిల్స్ పెట్టాడు.కార్లోస్ఈ–మెయిల్స్ చేసిన వారిలో అమ్మాయిలు, వర్సిటీ సిబ్బంది, ప్రొఫెసర్లు కూడా ఉన్నారు.

ఈ మెయిల్స్ చూసిన సదరు అమ్మాయిలు షాక్ అయ్యారు.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి మొత్తం యూనివర్సిటీ అంతా తెలిసిపోయింది.

నికోల్‌కు కూడా తెలిసింది.తనను కలుసుకోవడానికి కార్లోస్ చేసిన ప్రయత్నానికి ఆమె ఆసక్తిని రేకెత్తించింది.

తన పేరుతో యూనివర్సిటీలో అంత మంది ఉన్నారా? అని ఆశ్చర్యపోయింది.తన కోసం ఇంతలా తప్పించిన కార్లోస్‌ను కలుసుకుంది.

అతడితో డేట్‌కు ఓకే చెప్పేసింది.ఇక నికోలస్ పేరుతో ఉన్న అమ్మాయిలంతా తమను కలిపిన కార్లోస్ కి పెద్ద పార్టీ ఇవ్వానలి నిర్ణయించుకున్నారు .అదీ సంగతీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube