చిరంజీవి షూటింగ్ కు లేట్ గా వస్తే రోజంతా ఎండలో నిలబెట్టారట.. ఏమైందంటే?

Mestar Chiranjeevi Punished By Producer In Kothala Rayudu Movie Time

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించాయి.సీనియర్ హీరోలలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన హీరోగా మెగాస్టార్ చిరంజీవికి పేరుంది.

 Mestar Chiranjeevi Punished By Producer In Kothala Rayudu Movie Time-TeluguStop.com

కోట్ల సంఖ్యలో అభిమానులు చిరంజీవిని అభిమానిస్తారు.బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన చిరంజీవి ఎనిమిది మంది డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాబోయే నాలుగేళ్లలో పది సినిమాలు రిలీజయ్యేలా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

 Mestar Chiranjeevi Punished By Producer In Kothala Rayudu Movie Time-చిరంజీవి షూటింగ్ కు లేట్ గా వస్తే రోజంతా ఎండలో నిలబెట్టారట.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే చిరంజీవి ఈ స్థాయికి రావడానికి కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఒక నిర్మాత చిరంజీవిని రోజంతా ఎండలో నిలబెట్టగా చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.కెరీర్ పరంగా ఎదగాలనే ఉద్దేశంతో చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

చిరంజీవి హీరోగా వాణి తమ్మారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతలుగా కె.వాసు డైరెక్షన్ లో కోతల రాయుడు అనే సినిమా తెరకెక్కింది.

తులసి ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తులసి ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు చిరంజీవి షూటింగ్ కు ఆలస్యంగా వచ్చారని చిరంజీవిపై నిర్మాతలకు పట్టరని కోపం వచ్చిందని తులసి అన్నారు.

చిరంజీవిని రోజంతా ఎండలో నిలబడాలని నిర్మాతలు చెప్పగా చిరంజీవి మరో మాట మాట్లాడకుండా రోజంతా ఎండలో నిలబడ్డారని తులసి పేర్కొన్నారు.

Telugu Chiranjeevi, Kothala Rayudu, Time-Movie

చిరంజీవి ఆ విధంగా చేయడంతో తాను షాకయ్యానని తులసి వెల్లడించారు.నిర్మాతలకు చిరంజీవి ఎంతో గౌరవం ఇచ్చారని ఆ అవమానాన్ని మనసులో పెట్టుకోలేదని తులసి అన్నారు.తర్వాత రోజుల్లో చిరంజీవి స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకొని క్రేజ్ ను పెంచుకున్నారు.

వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

#Kothala Rayudu #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube