ఆ పని చేసినందుకు మెస్సీకి జరిమానా..!

ఈ మధ్య కాలంలో మరణించిన ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మరణం కారణంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో మరో ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు అయిన మెస్సి నివాళులు అర్పించినందుకు స్పానిష్ సాకర్ ఫెడరేషన్ జరిమానా విధించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Messi Fined For Doing That, Messi, Marodona, Football, Fine, Jerssy-TeluguStop.com

తాజాగా స్పానిష్ లీగ్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో బార్సిలోనా 40 తేడాతో ఒసాసునా జట్టు పై గెలిచింది.అయితే ఈ మ్యాచ్ లో బార్సిలోనా జట్టు తరఫున ఆడుతున్న మెస్సి తాను గోల్ చేసిన అనంతరం తన జట్టుకు సంబంధించిన జర్సీ తీసేసి లోపల ఉన్న మారడోనా పేరుతో ఉన్న జెర్సీ ప్రదర్శిస్తూ ఆకాశం వైపు చూస్తూ ముద్దులు పెడుతూ ఆ దిగ్గజ ఆటగాడికి నివాళులు అర్పించాడు.

ఇలా చేసిన తర్వాత మారడోనా జ్ఞాపకార్థం ఆ మ్యాచ్ అనంతరం మారడోనాకు సంబంధించిన పాత ఫోటోను, అలాగే తన ఫోటోను సైతం అదే జెర్సీని వేసుకున్న ఫోటో కలిపి మెస్సి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.ఇందుకు సంబంధించి అతడు ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆ ఫోటోని షేర్ చేస్తూ “ఫేర్వెల్ డిగో” అని స్పానిష్ లో రాసుకొచ్చాడు.

అయితే ఇక్కడే అసలైన విషయం జరిగింది.అదేంటంటే.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెస్సి తమ జట్టు జెర్సీ తీసేసి వేరే జెర్సీ ప్రదర్శించినందుకు మెస్సీకి ఎల్లో కార్డు చూపించడంతో పాటు, ఫెడరేషన్ బార్సిలోనా జట్టుకు కూడా 180 యూరోల జరిమానా విధించింది.అయితే ఈ విషయంపై మెస్సి, అలాగే బార్సిలోనా క్లబ్ కు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

ఏది ఏమైనా ఓ దిగ్గజ ఆటగాడికి నివాళులు అర్పించడం ద్వారా మెస్సి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి న పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube