శివమణి రియల్ స్టొరీ... ఇది కాస్తా వెరైటీ  

Message-in-a-bottle Author Found After 50 Years-indian Ocean,message-in-a-bottle,paul Gilmore

పూరీ జగన్నాథ్ శివమణి సినిమాలో జర్నలిస్ట్ అయిన సెకండ్ హీరోయిన్ గా బీచ్ లో ఓ సీసా దొరకడం. అందులో పేపర్ మీద శివమణి లవ్ స్టొరీ రాసి ఉండటం. దాని ఆధారంగా కథ ఆరంభం తెలుగు ప్రేక్షకులు అందరూ చూసారు..

శివమణి రియల్ స్టొరీ... ఇది కాస్తా వెరైటీ-Message-in-a-bottle Author Found After 50 Years

ఆ ఎలిమెంట్ కి టాలీవుడ్ ప్రేక్షకులకి కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు అలాంటి సంఘటన నిజజీవితంలో జరిగింది. అయితే అది జరిగింది ఆస్ట్రేలియాలో కావడం విశేషం.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో జ్యా ఎలియట్ అనే కుర్రాడికి ఓ సీసా దొరికింది. ఆ సీసాలో ఏదో కాగితం కూడా ఉండటంతో ఏంటా అని తీసి చదివాడు. ఆ కాగితంలో ఓ అడ్రస్ ఉండి, ఈ సీసా మీకు దొరికితే ఈ అడ్రస్‌కు రిప్లై ఇవ్వండి అని అందులో రాసారు.

ఇక ఆ అడ్రెస్ పశ్చిమ ఆస్ట్రేలియా ఫ్రీమాంటిల్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది. దానిని పాల్ గిల్మోర్ అనే వ్యక్తి 1969లో రాసినట్టు లెటర్‌ చదివాక ఎలియట్‌కు అర్ధమైంది. దాని గురించి తెలుసుకుందామనే ఆసక్తితో ఎలియట్ తన పేరెంట్స్ సహాయంతో కాగితంలో ఉన్న అడ్రస్‌కు నిజంగానే మెసేజ్ పంపించాడు. ఎలియట్ పంపిన సందేశం పాల్ గిల్మోర్ ఇంటికి వెళ్లింది.

50 ఏళ్ల క్రితం పంపిన సందేశానికి ఇప్పుడు స్పందన రావడంతో అందరూ కాస్తా షాక్ కి గురైన గిల్మోర్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసి పాల్ గిల్మోర్ తన 13వ యేట మొత్తం 6 లెటర్లను ఇలా రాసి బాటిళ్లలో పెట్టి సముద్రంలో విసిరినట్టు తెలిపారు పాల్ గిల్మోర్ ఇప్పుడు 63 ఏళ్ల వయసులో ఉన్నాడు అని తెలిపారు. ఇదిలా ఉంటే అతను ఒక రచయిత అని కూడా తెలిసింది. పాల్ గిల్మోర్ రాగానే ఆ సమాచారం అతనికి కూడా ఆమె సోదరి చేరవేసింది. మొత్తానికి అలా చిన్న వయస్సులో సరదాగా చేసిన పనికి 63 ఏళ్ల వయసులో పాల్ గిల్మోర్ కి సమాధానం వచ్చింది.