సీసా లో సందేశం.. చివరికి ఎక్కడికి దారితీసిందో తెలుసా..?  

Message Bottle Girls Friendship - Telugu Friendship Between Girls, Girls, How Message Bottle Makes Friendship Between Girls, Message Bottle

సీసా సందేశం.ఇలాంటి సందేశాలు అప్పట్లో రాజుల కాలంలో ఉండేవి అని మనం వినే ఉంటాం.

 Message Bottle Girls Friendship

కానీ తాజాగా ఇలాంటి ఒక సీసా సందేశం మరోసారి తెర మీదికి వచ్చే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సోషల్ మీడియా జనాలని ఒక రేంజ్ లో ఊపేస్తున్న వేళ ఈ సీసా సందేశం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా… అయితే సీసా సందేశం స్టోరీ ఏంటో చూద్దాం రండి మరి.11 ఏళ్ల వయసున్న సోఫియా, సారా బెత్ లు అమెరికాలో ఉంటున్నారు.వాస్తవంగా అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి పరిచయం సంబంధం లేదు.

అయితే న్యూయార్క్ కి చెందిన సోఫియా.సెలవుల్లో ఫ్లోరిడా కి వెళ్ళింది.ఇక అప్పుడే కరోనా వైరస్ కూడా వెలుగులోకి రావడంతో సోఫియా అక్కడే ఉండిపోవాల్సివచ్చింది.ఈ క్రమంలోనే అక్కడికి సమీపంలోని సముద్రానికి వెళ్లిన సోఫియా… తాను కరోనా వల్ల ఇరుక్కుపోయాను.

సీసా లో సందేశం.. చివరికి ఎక్కడికి దారితీసిందో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ వైరస్ తనకు అస్సలు నచ్చలేదని స్కూల్ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాను అంటూ చీటీలో రాసి సీసాలో పెట్టి ఆ సీసాను సముద్రంలోకి విసిరేసింది.

అయితే ఈ సీసా సమాచారం సరదాగా చేసింది కానీ దీనికి రిప్లై వస్తుందని సదరు బాలిక ఊహించి ఉండకపోవచ్చు.

ఇక సోఫియా పంపించిన సందేశం వెయ్యి కిలోమీటర్ల పైగా ప్రయాణించి చివరకు ఉత్తర కరోలినా లోని బీచ్ కి చేరింది.అక్కడ సారాబెత్ అనే మరో బాలిక చేతికి చేరింది.

సీసాలో నుంచి చీటీ తీసి చదివి వెంటనే దానికి రిప్లై పంపించింది సారాబెత్.కరోనా తగ్గిపోతుందని బోర్ గా ఫీల్ అవ్వద్దు అంటూ ధైర్యం చెప్పింది ఇలా ఒక సీసా సందేశం వారిని స్నేహితులుగా మార్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Message Bottle Girls Friendship Related Telugu News,Photos/Pics,Images..

footer-test