మేష రాశి వారిలో ఉన్న మంచి,చెడు గుణాలు ఏమిటో మీకు తెలుసా?  

  • మేషరాశి వారు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు ప్రపంచంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వరు. వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికి వదలరు. వీరు అబద్దాలు చెప్పేవారికి,నటించే వారికీ సాధ్యమైనంత దూరంలో ఉంటారు. మేష రాశి వారికి ఓపిక, సహనం చాలా తక్కువ. వీరికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది.వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు.

  • -

  • వీరు దేనికైనా ఎక్కువ సేపు ఎదురు చూడటం అసలు ఇష్టం ఉండదు. వీరికి ఎదురు చూడటం అంటే పరమ అసహ్యం. ఈ రాశి వారు బయటి వ్యక్తులకు చాలా కఠినంగా కన్పిస్తారు. కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా మారిపోతారు. వీరికి విపరీతమైన కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకే కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు.

  • మేష రాశి వారు మంచిగా ఉండేవారికి దగ్గర అవుతారు. అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని అసలు దగ్గరకు రానివ్వరు. వీరి మనస్తత్వం వింతగా ఉంటుంది. గాఢంగా ప్రేమించే వ్యక్తిని నిమిషంలో ద్వేషించేస్తారు. మేష రాశి వారు కొన్ని విషయాలలో చాలా మొండి పట్టుదలగా ఉంటారు. అలాగే ఒక్కోసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది. దాన్ని తట్టుకోవటం కూడా కష్టమే.

  • మేష రాశి వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే. ఆ బహుమతులు సేంట్ మెంట్,క్రియేటివ్ గా ఉంటే చాలా ఆనందిస్తారు. మేష రాశి వారు వారి కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తారు. లేదా మూడ్ మార్చుకొని ఆలా కూర్చుని ఉండిపోతారు.మేష రాశి వారు ఎవరి వద్ద నుండి సహాయాన్ని ఆశించకుండా ఇండిపిండేంట్ గా మరియు కాన్ఫిడెన్స్ గా ఉంటారు. వీరికి ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు వారిని సమస్యల్లో పాడేస్తుంది.