మేష రాశివారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు       2018-04-19   01:10:26  IST  Raghu V

మేష రాశి వారిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే వీరు కూడా అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడటమే కాకుండా వారి సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఆత్మ విశ్వాసం తక్కువగా ఉన్నవారు మేష రాశి వారిని తట్టుకోవటం చాలా కష్టం. మేష రాశి వారికీ జాతక రిత్యా కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. వీరిపై కుజ గ్రహ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవేశం,ఆత్మవిశ్వాసం బాగా ఎక్కువగా ఉండుట వలన ఆత్మ విశ్వాసం తక్కువ ఉన్నవారు వివాహం చేసుకుంటే మేష రాశి వారిని చూసి భయపడిపోతారు.

మేష రాశి వారు కాస్త సొంత ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మేష రాశి వారు ఏమి మాట్లాడిన వారిని అన్వయించుకొని మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఆ గొప్పను జీవిత భాగస్వామి అర్ధం చేసుకోకపోతే చాలా కష్టం. ఇలా అర్ధం చేసుకోకపోతే వారి మధ్య అపార్ధాలు చోటు చేసుకుంటాయి.

మేష రాశి వారు ఆ ధోరణిని మార్చుకుంటే మంచిది. మేష రాశి వారు నేను అనే పదానికి దూరంగా మనం అనే పదానికి దగ్గరగా ఉండటం అలవాటు చేసుకుంటే జీవిత భాగస్వామి మధ్య అపార్ధాలు ఉండవు.

మేష రాశి వారు ఎదుటి వారు కూడా తమ లాగే ఆలోచనలు,ప్రవర్తన ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ విషయంలో మేష రాశి వారిని జీవిత భాగస్వామి అర్ధం చేసుకోవాలి. వీరి మాటల్లో,చేతల్లో కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండుట వలన దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది.

వీరు ఎక్కువగా సాహోసోపేత నిర్ణయాలు తీసుకుంటూ సవాల్ ను ఎదుర్కొవాలని కోరుకుంటారు. వీరికి ఏదైనా తేలిగ్గా లభిస్తే తీసుకోరు. పోరాటం చేసి సాధించాలని అనుకుంటారు. పది మంది చేయలేని పనిని సాధించాలానే పట్టుదల మేష రాశి వారిలో అధికంగా ఉంటుంది. వీరు కష్టపడి పనిచేస్తారు. కాబట్టి ఈ విషయాన్నీ కూడా వీరి జీవిత భాగస్వామి అర్ధం చేసుకోవాలి.

మేష రాశి వారికీ వస్తే సాహోసోపేత నిర్ణయాలకు దూరంగా ఉండే భాగస్వామి వస్తే మేష రాశి వారిని భరించటం కష్టమే. వారు తీసుకొనే స్పీడ్ నిర్ణయాలకు ఒక్కోసారి భయం వేస్తుంది. అయినా మేష రాశి వారిని వారి జీవిత భాగస్వామి ఈ విషయంలో కూడా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే మేష రాశి వారికి డొంక తిరుగుడు వ్యవహారాలు అసలు నచ్చవు. వీరు ఉన్న విషయాన్నీ ఉన్నట్టు చెప్పేస్తూ ఉంటారు. ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని జీవిత భాగస్వామి అర్ధం చేసుకోవాలి.
వీరికి కొంచెం వ్యవహార శైలి కాస్త తక్కువగా ఉంటుంది. మేష రాశి వారు మాట్లాడే విధానం కాస్త సున్నితంగా ఉండేలా చూసుకోవాలి. మేష రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు జీవిత భాగస్వామికి కూడా చెప్పితే మంచిది.