తమన్నాను చూసి ఏడ్చేసిన డైరెక్టర్ కూతురు.. ఏం జరిగిందంటే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రంలో విలన్ పాత్రలో కనిపించి ఒక్కసారిగా ప్రేక్షకులకు అభిమానులకు షాక్ ఇచ్చారు.

 Merlapaka Gandi Daugter Cries After Watching Maestro Movie-TeluguStop.com

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో తమన్నాను చూసిన మేర్లపాక గాంధీ కుమార్తె లిపి బోరున ఏడ్చారు.

ఈమె తమన్నాకు పెద్ద ఫ్యాన్.ఈ క్రమంలోనే మాస్ట్రో మూవీ చూసిన లిపి పెద్దఎత్తున ఏడుస్తూ ఉన్నటువంటి వీడియోను హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.

 Merlapaka Gandi Daugter Cries After Watching Maestro Movie-తమన్నాను చూసి ఏడ్చేసిన డైరెక్టర్ కూతురు.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాట్‌ యా.నీ ఫ్యాన్‌ను ఏడింపించావు.డైరెక్టర్ గాంధీ కూతురు లిపి నీకు పెద్ద ఫ్యాన్.నేను చూసిన క్యూట్ వీడియో ఇది అంటూ తమన్నాకు ట్యాగ్ చేశాడు.ఇది చూసిన తమన్నా తప్పకుండా చిన్నారికి హగ్ ఇవ్వాల్సిందే అంటూ కామెంట్ చేశారు.

అసలు చిన్నారి ఏడవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.

ఇందులో తమన్నా విలన్ పాత్రలో నటిస్తూ సైలెంట్ గా అందరిని చంపుతూ ఉంటుంది.ఇది చూసిన లిపి గాంధీ తమన్నా బ్రెయిన్ మార్చేశాడు అంటూ బోరున ఏడ్చేసింది.

ఈ క్రమంలోనే లిపి తల్లి ఏం కాదు అది సినిమా అంటూ నచ్చ చెప్పింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Maestro #Tamannaah #Nithin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు