ఆయన చర్యలు నచ్చడం లేదు: ట్రంప్ అభిశంసనకు 70 శాతం అమెరికన్ల మద్ధతు

తన ప్రత్యర్ధి జో బిడెన్ కుమారుడు నిర్వహిస్తున్న వ్యాపారాలపై దర్యాప్తు చేపట్టాలని ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన వ్యవహారం అభిశంసనకు దారి తీసింది.ఆయనను ఎలాగైనా పదవి నుంచి దించేయాలని డెమొక్రాట్లు పావులు కదుపుతున్నారు.

 Mericans Say Trumps To Ukraines-TeluguStop.com

ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ఆధారాల సేకరణకు హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బహిరంగ విచారణ చేపట్టింది.తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినా… ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వారిని ట్రంప్ ఏకేస్తున్నారు.

ఈ సంగతి పక్కనబెడితే అసలు ట్రంప్‌పై అభిశంసన పట్ల దేశప్రజలు మనోగతం ఏమిటన్న దానిపై ప్రముఖ మీడియా సంస్థ ఏబీసీ న్యూస్ ఒక సర్వే చేపట్టింది.ఇందులో మెజార్టీ ప్రజలు ట్రంప్‌ అభిశంసన పట్ల సానుకూలంగానే వున్నారని తేలంది.

సర్వేలో పాల్గొన్న వారిలో మొత్తం 51 శాతం మంది అమెరికన్లు అభిశంసనవైపే మొగ్గుచూపుతున్నారు.హౌస్ కమిటీ విచారణ ప్రారంభం కాకముందు ఫైప్ థర్టీ ఎయిట్ అనే వెబ్‌సైట్ నిర్వహించిన మరో ప్రజాభిప్రాయ సేకరణలో 48 శాతం మంది ట్రంప్‌ను తొలగించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

Telugu Americanstrumps, Telugu Nri Ups, Trump, Ukraine-

చట్ట సభలో సైతం డెమొక్రాట్లు అధికంగా ఉండే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ట్రంప్ అభిశంసనకు మొగ్గు చూపగా.రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న సెనెట్‌లో డొనాల్డ్ ట్రంప్ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉన్న 51 శాతంతో పాటు మరో 19 శాతం మంది ట్రంప్ చర్యలు తప్పు అని, ఆయనను అభిశంసనలో ఓడించాలి కానీ పదవి నుంచి తొలగించకూడదని అభిప్రాయపడ్డారు.ప్రతి నలుగురు అమెరికన్లలో ఒకరు అంటే 25 శాతం మంది ట్రంప్ తప్పు చేయలేదని భావిస్తున్నారు.

Telugu Americanstrumps, Telugu Nri Ups, Trump, Ukraine-

ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్‌స్కీతో జూలై నెలలో జరిపిన ఫోన్ కాల్స్ తర్వాత.అభిశంసనను ఎదుర్కొంటారని 32 శాతం మంది తాము ముందుగానే ఊహించినట్లు తెలిపారు.మొత్తం మీద 58 శాతం మంది అమెరికన్లు హౌస్ కమిటీ విచారణను చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని సర్వేలో తేలింది.వీరిలో 21 శాతం మంది బహిరంగ విచారణ జరిగిన మొదటి వారం తర్వాత అభిశంసనపై తమ మనస్సు మార్చుకున్నట్లు తెలిపారు.

ఈ అభిప్రాయం వెలిబుబ్చిన వారిలో 60 శాతం మంది ట్రంప్‌ను అభిశంసన చేసి పదవి నుంచి తొలగించాలని పేర్కొన్నారు.మొత్తంగా ఉక్రెయిన్ పట్ల ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి మెజార్టీ అమెరికన్లు వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube