సిఎంను చంపేస్తానంటూ వ్యక్తి హల్ చల్

ముఖ్యమంత్రిని చంపేస్తానంటూ ఓ వ్యక్తి రచ్చరచ్చ చేశాడు.

శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని కేరళ భవన్‌ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కత్తితో భవన్‌ ఆవరణలోకి చొరబడ్డ ఓ వ్యక్తి.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ను చంపేస్తానంటూ హల్చల్ చేసిన ఘటన వివరాలు.

Mentally Unstable Man Tries To Harm Kerala Cm

విమల్‌ రాజ్‌ అనే నలభైఆరేళ్ల వ్యక్తి చేతిలో కొన్ని పేపర్లు.జేబులో జాతీయ జెండా, కత్తితో కన్నౌట్‌ ప్లేస్‌ లోని కేరళ భవన్‌ వద్దకు చేరుకున్నాడు.మెయిన్‌ గేట్‌ సెక్యూరిటీ కళ్లు గప్పి ఎలాగోలా లోపలికి ప్రవేశించాడు.

అయితే ఆవరణలోని అధికారులు అతన్ని అడ్డుకునే సరికి లోపలికి అనుమతించాలంటూ వారితో వాగ్వాదానికి దిగాడు.నెలరోజులుగా ఓ కేసు నిమిత్తం తాను సీఎంను కలిసేందుకు యత్నిస్తున్నానని, అయితే.

Advertisement
Mentally Unstable Man Tries To Harm Kerala Cm-సిఎంను చంపే�

ఆ పని జరగట్లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.సిఎంను చంపేస్తానంటూ విమల్ రాజ్ బెదిరించడంతో అధికారులు అతన్ని వెనకాల నుంచి వెళ్లి చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

కొడవూర్‌, కరిపుజ్జాకు చెందిన విమల్‌ కు మతిస్థిమితం సరిగ్గాలేదని, అతని చేతిలో ఉన్న పేపర్లు అతని మెడికల్‌ రిపోర్ట్‌ లేనని చెబుతున్నారు అధికారులు.ప్రస్తుతం అతన్ని చికిత్స కోసం హస్పిటల్ (IBHAS) కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు