వికలాంగురాలును కూడా వదలని కామాంధులు..

రోజురోజుకు అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి.అమ్మాయి కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు.

 Mentally Challenged Girl Get Pregnant After Two Youth Raped, Crime News, Mentall-TeluguStop.com

ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తుంది.చిన్న పిల్లలు, ముసలివాళ్ళు అనే తేడా లేకుండా కామాంధులు తమ కోరికలను తీర్చుకుంటున్నారు.

తాజాగా జరిగిన ఈ సంఘటన వింటే మనం ఏ సమాజంలో ఉంటున్నామో అనిపిస్తుంది.

వికలాంగురాలు అని కూడా చూడకుండా ఆమెపై ఇద్దరు కుర్రాళ్ళు లైంగిక వాంఛ తీర్చుకున్నారు.13 సంవత్సరాల మానసిక వికలాంగురాలుకు స్వీట్స్ ఇస్తామని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడి చేసారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీపూర్ జిల్లాలోబరేలీ ప్రాంతంలో ఒక వ్యవసాయ కుటుంబం నివసిస్తుండేది.ఆ రైతుకు 13 సంవత్సరాల బాలిక ఉంది.

ఆమె మానసిక వైకల్యంతో బాధపడుతుంది.కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఆమెను ఇంట్లోనే ఉంచి వెళ్లేవారు.

దీన్ని గమనించిన ఇద్దరు యువకులు ఆమెతో పరిచయం పెంచుకున్నారు.

ఆ బాలికకు స్వీట్స్ అంటే ఇష్టం అని తెలిసి వాటిని కొనిచ్చి ఆమెపై వాళ్ళ కోరికలు తీర్చుకునేవారు.

ఇలా నెలల తరబడి ఆ ఇద్దరు మృగాళ్లు పలుసార్లు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు.తర్వాత కొద్దిరోజులకు ఆ బాలిక పొట్ట ఎత్తుగా కనిపించడం, అప్పుడప్పుడు నొప్పి అని అరుస్తుండడంతో ఆ బాలికను తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

కొన్ని టెస్టులు తర్వాత ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని డాక్టర్లు చెప్పడంతో తల్లి దండ్రులు ఆశ్చర్యపోయారు.

ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ దారుణానికి కారణం ఎవరో తెలియక.

ఆ బాలికను నిలదీసిన చెప్పలేకపోవడంతో వారికి ఏమి చేయాలో అర్ధం కాక వేదనకు గురయ్యారు.అయితే మానసిక నిపుణులు ఆ బాలిక దగ్గర నుండి నిజం రాబట్టారు.

దీంతో ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube