వైరల్: కేవలం మొగుళ్ళు మాత్రమే దేవుడికి పొంగలి నైవేద్యం పెట్టే ఆచారం ఎక్కడో తెలుసా..?!

ఇప్పుడు చెప్పబోయే విషయాన్నీ వింటే మీరు షాక్ అవుతారు.అది ఏంటంటే… సాధారణంగా ఎక్కడయినా దేవుళ్లకు మొక్కులు మొక్కితే ఆడవాళ్లు పొంగళ్లు పెట్టి ఆ మొక్కును తీర్చుకుంటారు.

 Mens Festival Pullampeta Village Ritual-TeluguStop.com

కానీ.ఇక్కడ మాత్రం అలా జరగదు.

ఆడవాళ్ళకి బదులు మగవాళ్లే పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు.మీరు విన్నది నిజమే అండి.

 Mens Festival Pullampeta Village Ritual-వైరల్: కేవలం మొగుళ్ళు మాత్రమే దేవుడికి పొంగలి నైవేద్యం పెట్టే ఆచారం ఎక్కడో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కావాలనుంటే ఇది చదవండి.పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఇలాంటి ఆచారం ఒకటి వాళ్ళ తరతరాలుగా వస్తోంది అంట.ఇక్కడ మగవాళ్ల పొంగళ్లను ఘనంగా జరుపుకొంటున్నారు.అయితే పెద్ద పండుగ కి ముందు వచ్చే ఆదివారం ఇలా చేస్తారు.

మరో వింత ఆచారం ఏమిటంటే.? ఇక్కడ సంక్రాంతి పండగ కంటే పొంగళ్లు పండుగనే ఘనంగా జరుపుకొంటారు అంట.

ఈ ఊరు వాళ్ళు వేరే ఎక్కడ ఉన్న సరే తప్పకుండా ఆ రోజు మాత్రం అక్కడకి వచ్చేస్తారు.అయితే ఈ ఆచారం వెనుక పెద్ద కథ ఉంది.

అదేమిటంటే.కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఓ బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండేవాడట.

పురుషులతో తప్ప స్త్రీలతో మాట్లాడే వాడు కాదు అని గ్రామస్థులు చెబుతున్నారు.అయితే ఆయన గ్రామంలో ఓ శిలను నాటి దానిపై లిపిని రాసి ఎక్కడికో వెళ్ళిపోయాడట.

దాని మీద అతను ఏమి రాసాడంటే.? మీ గ్రామం సుభిక్షంగా, చల్లగా ఉండాలంటే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామికి ఆడవారు కాకుండా మగవారే పొంగుబాళ్లు పెట్టాలని రాసి వెళ్ళిపోయాడట.అలా అప్పటి నుంచీ ఈ ఆచారాన్ని అక్కడ గ్రామస్థులు పాటిస్తున్నారు.అయితే అక్కడ మహిళలు మాత్రం ఆలయం లోకి రాకుండా వెలుపల నుంచే స్వామిని దర్శించుకుంటారు.అంతే కాదు స్వామి వారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మగవాళ్లే తినాలి అన్నది ఆచారం.దానిని ఆడవాళ్లు ఎవరు కూడా కనీసం తాకరు కూడా.

అలానే ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు.ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు అంతే.

కానీ దానినే అంతా పూజిస్తారు.నిజగా వింత ఆచారం కదా.

#Mens #Kadapa District #SanjeevaRaya #Special #Rituals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు