నేడే కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్..!

మరికొన్ని గంటల్లో ఎమర్జింగ్ ఆసియా కప్ గ్రూప్ గ్రౌండ్ లో భాగంగా కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్( India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరగనుంది.దాయాది దేశంతో జరిగే పోరు కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 Mens Emerging Teams Asia Cup 2023 India-a Vs Pakistan-a Match Will Be Played At-TeluguStop.com

భారత్, పాకిస్తాన్ జట్లు తమ తొలి మ్యాచ్లలో 2-2 తో విజయం సాధించి సెమీఫైనల్ కు చేరువయ్యాయి.నేడు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

ఎమర్జింగ్ ఆసియా కప్ లో( Emerging Asia Cup ) భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్లో యూఏఈని 8 వికెట్ల తేడాతో ఓడించింది.యూఏఈ తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్ 108 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మరొక వైపు భారత జట్టు బౌలర్ హర్షిత్ రాణా ఏకంగా నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో భాగస్వామి అయ్యాడు.

తర్వాత నేపాల్ తో ( Nepal )జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో నేపాల్ ను భారత్ మట్టికరిపించింది.నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ 87 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.మరొకవైపు సాయి సుదర్శన్ ( Sai Sudarshan ) కూడా 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి భారత జట్టు విజయంలో భాగస్వామి అయ్యాడు.

తాజాగా జరగబోతున్న పాకిస్తాన్- భారత్ మధ్య మ్యాచ్ లో కూడా భారత ఆటగాళ్లు ఇదే ఫామ్ కోనసాగిస్తే ఘనవిజయం భారత్ ఖాతాలో పడుతుంది.మరో గ్రూపులో శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్లు సెమీఫైనల్ లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి.జులై 21న సెమీఫైనల్ మ్యాచ్, జూలై 23న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube