మోనోపాజ్ లక్షణాలు-30-40 వయస్సు గల మహిళలు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు  

మహిళల్లో మోనోపాజ్ దశ చాలా కీలకమైనదని చెప్పవచ్చు. ఈ దశలో శారీరకంగానూ, మానసికంగానూ ఎన్నో మార్పులు జరుగుతాయి. మోనోపాజ్ వచ్చిందని చెప్పటానికి పీరియడ్స్ ఆగిపోవటం పెద్ద సూచనగా చెప్పవచ్చు. అంతేకాక మరి కొన్ని లక్షణాల కారణంగా మోనోపాజ్ దగ్గరలోనే ఉందని గుర్తించవచ్చు. ఇప్పుడు ఆ లక్షణాల గురించి తెలుసుకుందాం.

మోనోపాజ్ దశలో హార్మోన్స్ లో హెచ్చుతగ్గులు ఉంటాయి. దాని కారణంగా తలనొప్పి వస్తుంది. మాములు సమయాలలో తలనొప్పి ఉంటే ఈ సమయంలో వచ్చే తలనొప్పి ఎక్కువగా ఉంటుంది.

నిద్రలేమి సమస్య వస్తుంది. అందువల్ల ప్రతి రోజు ఒకే సమయంలో పడుకోవటం అలవాటు చేసుకోవాలి. పడుకోవటానికి ముందు టీవీ చూడటం మరియు భోజనం చేయటం చేయకూడదు. పడుకోవటానికి రెండు గంటల ముందే భోజనం చేయాలి.

Menopause In Women-

Menopause In Women

మెదడు చురుగ్గా పనిచేయకపోవడం వలన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అలాగే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఒక్కసారిగా ఆనందం ఒక్కసారిగా బాధ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో చికాకు కూడా ఎక్కువగానే ఉంటుంది.

చర్మంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. చర్మంలో స్థితిస్థాపకత తగ్గుతుంది. దాంతో ముడతలు,పొడిదనం వస్తాయి. ఈస్ట్రోజన్ తగ్గటం వలన చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తి తగ్గి చర్మం మృదుత్వాన్ని కోల్పోయి మందంగా మారుతుంది.

మోనోపాజ్ దశలో జుట్టు పల్చబడుతుంది. లేదా ఎక్కువగా జుట్టు రాలడం జరుగుతుంది. అలాగే అవాంచిత ప్రదేశాల్లో లేదా అప్పర్ లిప్ మీద హెయిర్ ను మీరు గమనించవచ్చు.