మద్యం తాగడానికి డబ్బులు లేక చివరికి కన్న కూతురిని 5 వేల రూపాయలకి...  

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు సంపాదించడం కోసం ఎంతటి ఘాతుకానికి అయినా పాలపడుతున్నారు.మహా భారతంలో జూదం ఆడడానికి పాండవులు ఏకంగా తమ భార్యని ఒడ్డి ఓడిపోయి వనవాసం కూడా చేశారని మనం పుస్తకాలలో చదువుకున్నాము.

TeluguStop.com - Men Try To Sell His Daughter In Nellore

 కానీ ఈ కలియుగంలో తాజాగా ఓ కన్న తండ్రి మద్యం సేవించడానికి డబ్బులు లేక తన రక్తం పంచుకు పుట్టిన కూతురినే మద్యం దుకాణం దగ్గర అమ్మకానికి పెట్టిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.

TeluguStop.com - మద్యం తాగడానికి డబ్బులు లేక చివరికి కన్న కూతురిని 5 వేల రూపాయలకి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే ఇతడు ఇటీవలే తెలిసిన వారి ద్వారా పని నిమిత్తం మహారాష్ట్రలో ఉన్నటువంటి తన సొంత గ్రామం నుంచి  నెల్లూరుకు వచ్చాడు. కానీ అనుకోని విధంగా నమ్మి వచ్చినటువంటి వ్యక్తి మోసం చేయడంతో ఇంటికి వెళ్లలేక చివరికి ఖాళీ ప్రదేశంలో టెంట్ నిర్మించుకొని నివాసముంటున్నాడు.

 అయితే  ఇతడు ఈ మధ్యకాలంలో మద్యానికి బానిసయ్యాడు.దీంతో అప్పుడప్పుడు కూలి పనులకు వెళుతూ వచ్చిన డబ్బుతో ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు.కానీ ఈ మధ్య పనులు దొరకకపోవడంతో మద్యం సేవించడానికి డబ్బులు లేక విలవిలలాడి పోయాడు. దీంతో ఇక తన కన్న కూతురిని అమ్మేసి మద్యం సేవించాలని అనుకున్నాడు.

వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మద్యం దుకాణం దగ్గరికి వెళ్లి తన కూతురిని 5 వేల రూపాయలకి అమ్ముతున్నానని అంటూ అమ్మకానికి పెట్టాడు.దీంతో స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు బాలికను రక్షించారు.

ఈ విషయంపై స్పందించినటువంటి కొందరు నెటిజన్లు ప్రస్తుతం ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఈ క్రమంలో బయటి వాళ్ల నుంచి మాత్రమే కాకుండా సొంత కుటుంబ సభ్యులు కూడా వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక సమాజంలో ఆడ పిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ అధికారులు మరిన్ని కఠిన చర్యలు మరియు చట్టాలను తీసుకు రావాలని కోరుతున్నారు.

#Andhra Pradesh #MenTry #MenTry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు