దారుణం : భార్య గవర్నమెంట్ జాబ్ సంపాదించలేదని భర్త ఏకంగా…  

men tortured his wife for not getting government jobs in Vikarabad, Women Handling case, Vikarabad, Crime news, Telangana, Government Job, - Telugu Child Abusing, Crime News, Government Job, Men Tortured His Wife For Not Getting Government Jobs In Vikarabad, Telangana, Vikarabad, Women Handling Case

ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకి గిరాకీ పెరగడంతో ప్రతి ఒక్కరూ ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని  గవర్నమెంట్ ఉద్యోగ పరీక్షలకు బాగానే ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇందులో కొంతమంది ఉద్యోగాలు దక్కించుకుంటే మరికొంతమంది మాత్రం ఫెయిల్ అయినా నిరాశ చెందకుండా పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

TeluguStop.com - Men Tortured His Wife For Not Getting Government Jobs In Vikarabad

అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించలేదని ఆమెను రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఘటన తెలంగాణ వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణ పరిసర ప్రాంతంలో అజీముద్దీన్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.

TeluguStop.com - దారుణం : భార్య గవర్నమెంట్ జాబ్ సంపాదించలేదని భర్త ఏకంగా…-Business - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే అజీముద్దీన్ కుటుంబ పోషణ నిమిత్తం టిఎస్ఆర్టిసి లో బస్ కండక్టర్ గా పని చేస్తున్నాడు.అజీముద్దీన్ భార్య టిటిసి చదువు పూర్తి చేసి ప్రస్తుతం గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించడం కోసం ప్రయత్నిస్తోంది.

అయితే గతంలో జరిగినటువంటి టీచర్ ఉపాధ్యాయ నియామకాల కోసం జరిగినటువంటి పోటీ పరీక్షల్లో అతడి భార్య ఫెయిలయింది. దీంతో అప్పటి నుంచి అజీముద్దీన్ ఆమెపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు ఇందులో భాగంగా తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యపై మరియు పిల్లలపై దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.

దీంతో భర్త చేష్టలతో విసిగిపోయిన ఆమె వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్త చేస్తున్నటువంటి అఘాయిత్యాలు గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు బస్ కండక్టర్ అజీముద్దీన్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్  ఇచ్చి సర్ది చెప్పాలని ప్రయత్నించినప్పటికీ అజీముద్దీన్ వినకపోవడంతో అతడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

#Telangana #Government Job #WomenHandling #Vikarabad #Child Abusing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Men Tortured His Wife For Not Getting Government Jobs In Vikarabad Related Telugu News,Photos/Pics,Images..