ఇదేం రిక్వెస్ట్ భయ్యా : సాయంత్రం శృంగారం చేయడానికి వెళ్లాలి.... అనుమతివ్వండంటూ....

ఒక్కోసారి అనుకోకుండా పొరపాటును చేసినటువంటి పనుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బయట సంచరించేందుకు ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 Men Spelling Mistake Is Viral In Kerala, Kerala, Corona Virus, Lock Down, Spelli-TeluguStop.com

దీంతో కొందరు ఇతర సమయాల్లో బయటకు వెళ్లేందుకుగాను ప్రత్యేక అనుమతుల కోసం ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో ఓ వ్యక్తి చేసినటువంటి చిన్న పొరపాటు కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాడు.

అయితే ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవలే కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో “లాక్ డౌన్” విధించారు.దీంతో ఓ వ్యక్తి సాయంత్రం ఆరు గంటలకి పని మీద బయటకు వెళ్లాలని ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే ఈ పాస్ లో అనుకోకుండా ఈవినింగ్ సిక్స్ కి బదులుగా ఈవెనింగ్ సెక్స్ అని స్పెల్లింగ్ తప్పుగా రాశాడు.దీంతో సాయంత్రం సెక్స్ కోసం బయటకు వెళ్లాలని ఈ పాస్ జారీ చేయాలని కోరినట్లు అధికారులు భావించారు.

దాంతో వెంటనే ఆ వ్యక్తిని గాలించి పట్టుకొని విచారించగా సిక్స్ కి సెక్స్ అని తప్పుగా పడిందని తను కావాలని ఈ పొరపాటు చేయలేదని వివరణ ఇచ్చాడు.దీంతో పోలీసులు అతనిని క్షమించి వదిలేశారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రోజురోజుకీ దేశవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.దీంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

అలాగే ఆసుపత్రుల్లో పడకలు, సరైన వసతులు లేక ఇబబందులు పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube