అమ్మాయిల్ని అలాంటి సమయంలో అర్థం చేసుకోవాలి అబ్బాయిలు

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని అన్నారు కవులు.ఈరోజు ఒక మాటకు నవ్విన అమ్మాయి, రేపు అదే మాటకు కోపగించుకోచ్చు.

 Men Should Understand The Possible Reasons For Mood Swings In Female-TeluguStop.com

ఈరోజు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు.అమ్మాయిలతో అబ్బాయిలు పడే ఇబ్బందే ఇది.దీన్నీ “మూడ్ స్వింగ్స్” అని అంటారు.అంటే సడెన్ గా మూడ్ మారిపోవడం.

చనువు కొద్ది ఈరోజు ఒక జోక్ చేసారు అనుకోండి, అమ్మాయి పగలబడి నవ్వింది.తనను నవ్విస్తున్నాను కదా అన్న కారణంతో మళ్లీ అదే జోక్ చేసిన నవ్వొచ్చు.

కాని మూడ్ స్వింగ్ అయినప్పుడు అదే అమ్మాయి, అదే విషయానికి అలాగే నవ్వొచ్చు, నవ్వకపోవచ్చు.మీ పిలుపు నచ్చకపోవచ్చు, మీతో ఉండటం కూడా ఇష్టం కాకపోవచ్చు.

ఈ మూడ్ స్వింగ్ కి కారణాలు చాలా ఉన్నాయి.వాటిలో పిరియడ్స్, మొనోపాజ్ కూడా కారణం కావచ్చు.

అలాంటి సందర్భాల్లో శరీరంలో ఉన్న ఇబ్బందులు వారి ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తాయని సైన్స్ చెబుతోంది.

అందుకే వయసు సంబంధం లేకుండా, యువతులు కాని, మహిళలు కాని, సడెన్ గా కొత్తగా ప్రవర్తించినా, కాస్త గట్టిగా మాట్లాడినా, వెంటనే వారి మీద ఒక అభిప్రాయానికి రాకూడదు మగవారు.

కొన్నిరోజుల విరామం తరువాత కూడా అదే రకమైన ప్రవర్తన ఉంటే, అప్పుడు అది మీ మీద ఏర్పడిన అభిప్రాయం అనుకోవచ్చు.

అంతేకాని, చిన్న చిన్న విషయాలకి కూడా అమ్మాయిలు ఇంతే, అర్థం కారు అని పెద్ద పెద్ద డైలాగులు వద్దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube