తెలుగులో వచ్చిన హుషారు సినిమాలో హీరో ఫ్రెండ్స్ యుట్యూబ్ చూసి అందులో బీర్ ఎలా తయారు చేయాలో తెలుసుకొని సీక్రెట్ గా చేస్తారు.అయితే ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకి దొరికిపోతారు.
ఇప్పుడు ఇంచుమించు అలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది.ఓ యువకుడు యుట్యూబ్ లో క్యారెట్ నుంచి బీర్ తయారు చేసే విధానం తెలుసుకొని అలా తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నాడు.
అయితే పోలీసులకి దొరికిపోయి ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు.లాక్ డౌన్ టైంలో మద్యం షాపులు పూర్తిగా బంద్ కావడంతో తాగుబోతులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది.
ఈ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాలలో సారాయి తయారి కూడా విపరీతంగా పెరిగిపోతుంది.
తమిళనాడులో తిరుచ్చినాంకుప్పం ప్రాంతానికి చెందిన సుకుమార్ అనే యువకుడు యుట్యూబ్ లో చూస్తూ కొన్ని రసాయినాలు ఉపయోగించి క్యారెట్ బీర్ తయారు చేసి విక్రయిస్తున్నాడు.
ఆ ప్రాంతంలో ఎవరో క్యారెట్ బీర్ తయారు చేసి అమ్ముతున్నట్లు పోలీసులకి సమాచారం అందడంతో గస్తీ చేపట్టగా అతను దొరికిపోయాడు.ఈ సందర్భంగా సుకుమార్ నుంచి రెండు లీటర్ల క్యారెట్ బీర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈస్ట్ అనే రసాయన పౌడర్‌ను చేర్చి రెండు రోజులు మగ్గపెట్టి, అనంతరం దాన్ని తాగితే మత్తు వస్తుందన్న విషయాన్ని అతను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడని పోలీసులు తేల్చారు.మొత్తానికి లాక్ డౌన్ టైంలో మద్యం కోసం ఈ యువకుడు చేసిన కొత్త ప్రయత్నం ప్రపంచానికి తెలిసిన, దాని వలన అతను అనవసరంగా అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చోవాల్సి వచ్చింది.