బీరు పోసి మరీ మొసలి ని పెంచుకుంటున్న యువకుడు,చివరికి

ఎవరైనా జంతువులు అంటే ప్రేమ ఉన్నవారు ఏ పిల్లి నో, కుక్క నో,ఇంకా లేదంటే పక్షులు,రాబిట్ ఇలా ఎవరి ఇష్టమైన విధంగా వారు పెంచుకుంటూ ఉంటారు.అయితే ఇదంతా కూడా మనదేశం వరకు మాత్రమే.

 Men Pourbeer Intoalligators Mouth-TeluguStop.com

కానీ విదేశాల్లో మాత్రం అందుకు భిన్నంగా జంతువులను పెంచుకుంటూ ఉంటారు.ఉదాహరణకు పాములు,మొసళ్లు ఇలా.మీరు వింటుంది నిజమే మొసళ్ల ను కూడా అక్కడ చాలా మంది పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఇలా మొసళ్ల ను పెంచుకోవడం రిస్క్ అయినప్పటికీ కూడా ఎవరూ కూడా వెనుకాడడం లేదు.

అయితే ఇలాంటి జంతువులను పెంచుకోవడం ఎంత ప్రమాదమో ఈ తాజా ఉదంతం తో మరింత అర్ధం అవుతుంది.వివరాల్లో కి వెళితే… ఇటీవల ఫ్లోరిడా కు చెందిన టీమొతీ కెప్కే అనే యువకుడు తన ఫ్రెండ్ తో వస్తుండగా మొసలి ఒకటి దొరకడం తో ఇంటికి తీసుకువచ్చాడు.

అనంతరం దానిని పెంచుకోవాలని నిర్ణయించుకొని తనను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు.అయితే అక్కడితో ఆగకుండా దానికి రోజూ బీరు కూడా పోస్తుండడం తో ఆ మొసలి కాస్త తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మొదలు పెట్టింది.

ఈ క్రమంలో తాగిన మైకంలో అది ఒకసారి టీమొతీ చేతికి కూడా గాయం చేసినట్లు తెలుస్తుంది.అయితే దానితో ఆటలాడుతూ వీడియో తీస్తున్న సమయంలో టీమొతి చేతికి గాయం కావడం ఆ తరువాత ఆ వీడియో బయటకు రావడం తో ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అయితే ఈ సమాచారం పోలీసుల వరకు చేరడం తో టిమొతీ కెప్కే ను అరెస్ట్ చేశారు.ఆగష్టు 26 వ తేదీన మొసలి తమకు దొరికిందని ఇంటికి తీసుకొచ్చినట్టు టిమొతీ కెప్కే పేర్కొన్నాడు.

దానికి బీరుపోసి పెంచినట్టు ఒప్పుకోవడంతో టిమొతీ కెప్కే ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telugu Beeralligators, Crocodile, Beer, Telugu Nri Ups, Telugu Ups-

అయినా మొసలి కి బీరు పోసి పెంచడం ఏంటో అని నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు.తాగితే మనిషే కాదు జంతువు కూడా తనను తాను మరచిపోయి బిహేవ్ చేస్తుంది అని అనడానికి ఈ తాజా ఉదంతం ఉదాహరణ గా చెప్పాలి.ఇలాంటి జంతువులను పెంపుడు జంతువులు గా పెంచుకుంటే ఇలాంటి ప్రమాదాలే చోటుచేసుకుంటాయి అన్న విషయం ఇప్పటికైనా అర్ధం అవుతుందో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube