జాగ్రత్త భయ్యా : అలాంటి వాటి కోసం గూగూల్ లో వెతికి అర లక్ష పోగొట్టుకున్న యువకుడు...

ప్రస్తుతం టెక్నాలజీ పరంగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో కొందరు ప్రతి చిన్న విషయానికి ఇంటర్నెట్ మీద ఆధార పడుతున్నారు.దీంతో మానవ జీవితంలో గూగుల్, ఫేస్ బుక్, జీ- మెయిల్, ట్విట్టర్,  వంటి మాధ్యమాలు బాగమైపోయాయి.

 Men Lose 80 Thousand Rupees While Calling To Customer Care Number In Delhi,  Del-TeluguStop.com

అయితే తాజాగా ఓ యువకుడు ఓ ప్రముఖ సంస్థ కస్టమర్ కేర్ నెంబర్ ని గూగుల్ లో వెతికి ఫోన్ చేసినందుకు దాదాపుగా 80 వేల రూపాయలను పోగొట్టుకున్న సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలో రాజేష్ (పేరు మార్చాం) అనే ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.

ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఇటీవలే ఇతడికి రాంచి పట్టణం నుంచి తన స్నేహితుడు డిటిడిసి కొరియర్ ద్వారా ఒక కొరియర్ ని  పంపించాడు.

అయితే ఈ కొరియర్ ఈ పాటికే డెలివరీ కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల కొంతమేర ఆలస్యం అయింది. దీంతో కొరియర్ ఆలస్యం కావడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి రాజేష్ డిటిడిసి కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ లో సర్చ్ చేశాడు.

దీంతో గూగుల్ చూపించిన ఫోన్ నెంబర్ ని తీసుకొని ని వారికి ఫోన్ చేశాడు.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

Telugu Care, Delhi, Dtdc Courier, Losethousand, Fraud-Latest News - Telugu

కానీ రాజేష్ ఫోన్ రిసీవ్ చేసుకున్న అవతలి వ్యక్తి అచ్చం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మాదిరిగానే మాట్లాడుతూ మాటల్లోకి దింపాడు.ఈ క్రమంలో రాజేష్ గురించి పలు వివరాలను అడిగి తెలుసుకొని అతడి అకౌంటు నుంచి దాదాపుగా 80 వేల రూపాయలకు పైగా లూటీ చేశాడు.దీంతో ఉన్నఫలంగా డబ్బులు  ట్రాన్స్ ఫర్ అయినట్లు మెసేజ్ రావడంతో రాజేష్ ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.అంతేగాక అప్పటి వరకు తాను మాట్లాడుతున్న ఫోన్ కూడా డిస్కనెక్ట్ అయింది.

దీంతో లబోదిబోమంటూ తన డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించాడు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ రాజేష్ ఒక్క క్షణం పాటు ఆలోచించి దగ్గరలో ఉన్నటువంటి డిటిడిసి కొరియర్ సంస్థ కి వెళ్లి వివరాలను తెలుసుకొని ఉంటే తన డబ్బు  ఆన్ లైన్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళేది కాదని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాక ప్రస్తుత కాలంలో కొందరు ప్రతి చిన్న విషయానికి గూగుల్ పై ఆధార పడుతున్నారని అది సరికాదని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube