యువతిని రేప్ చేసి పెళ్లి చేసుకోమన్నాడు..చివరికి ఏం జరిగిందంటే..   Men Kindnapped And Rapped Women Empoly     2018-07-18   11:41:57  IST  Bhanu C

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఒక దారుణం ఇప్పుడు యువతులకి ఉద్యోగాలకి వెళ్లాలంటేనే గుబులు రేపుతోంది..ఒక కంపెనీ యజమాని తన వద్ద పని చేసే యువతిని ఒక ఇంట్లో భందించి నెల రోజలుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు అయితే ఆ యజమాని నుంచీ తప్పించుకున్న యువతి పోలీసులకి తన తల్లితండ్రులతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేసింది అయితే ఈ ఘటనలో ట్విస్ట్ ఏమిటంటే..

సంతోష్ నగర్‌కు చెందిన షహన్‌షా షరీఫ్‌…రోబోటిక్‌ డిప్లొమా చేశాడు. కొన్నాళ్లు కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేసి వచ్చాడు..తన స్నేహితులతో కలిసి చంద్రాయణగుట్టలోని గుల్షన్‌ ఇక్బాల్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ మినాజ్‌తో కలిసి హబ్సిగూడలో మైరా టెక్నాలజీస్‌ పేరుతో ఓ కంపెనీ స్థాపించాడు..ఈ కంపెనీలో ఒక యువతిని టెలీకాలర్‌గా నియమించాడు…ఆఫీస్‌ పనిమీద అంటూ ఆమెను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేవాడు.

అయితే గత ఏడాది మార్చి 10న ఆమెను జహనుమ సమీపంలోని వట్టేపల్లికి తీసుకెళ్లి, ఓ అద్దె గదిలో ఉంచి నెల రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు…అంతేకాదు ఈ ఘటనని వీడియో ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పెడుతాను అంటూ బెదిరింపులు చేశాడు..తనతో పాటు రావాలంటూ యువతిని బెరించి ముంబైతోపాటు పలు రాష్ట్రాలకు తీసుకెళ్లాడు..అయితే యువతిని నెలరోజులుగా వాడుకున్న అతడు ఆమెకి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు

నాకు పెళ్లి అయ్యిందని అయితే తన భార్య విడాకులు ఇచ్చింది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు..అయితే కొన్ని రోజుల క్రితం భాధితురాలు షరీఫ్‌ నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకుంది తన తల్లితండ్రులతో కలిసి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది…ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిపై పలు కేసులు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.