దారుణం: పని మనిషి మోజులో పడి ఏకంగా కుటుంభ సభ్యులని కిరాతకంగా...

ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ఏకంగా కుటుంబ సభ్యులను హతమార్చడానికి కూడా వెనుకాడడం లేదు.తాజాగా ఓ వ్యక్తి తన భార్య ఇంట్లో  పని చేస్తున్నటువంటి పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి తన భార్య ని, కన్న తల్లిదండ్రులను, అక్లుని దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Family Members, Illegal Affair, Crime News, Uttar Pradesh,-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ప్రయాగరాజ్ అనే ప్రాంతంలో అతీష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు కుటుంబం కోసం నిమిత్తమై ఎలక్ట్రికల్ వస్తువులకి సంబంధించిన దుకాణాన్ని నడుపుతున్నాడు.

అయితే ఇతడు అక్రమ సంబంధాల మోజులో పడి ఇంటా, బయట పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు.దీంతో కుటుంబ బాధ్యతలను విస్మరించి చెడ్డ దారులకి బానిసయ్యాడు.ఈ విషయమై పలుమార్లు తన కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతుండేవి.దీంతో అతీష్ తన కుటుంబ సభ్యులను హతమార్చాలని పన్నాగం పన్నాడు.

ఇందులో భాగంగా డబ్బులు తీసుకుని హత్యలు చేసేటువంటి కొందరు వ్యక్తులను సంప్రదించి తన కుటుంబ సభ్యులను హతమార్చాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

పథకం ప్రకారం అనుకున్న విధంగానే తన కట్టుకున్న భార్య ని, తన తల్లిదండ్రులను మరియు అతని సోదరిని అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు.

అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తమై తరలించారు.అలాగే కొందరు స్థానికులు అతీష్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసులకు చెప్పడంతో పోలీసులు అతీష్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే తన కుటుంబ సభ్యులను హతమార్చినట్లు నేరాన్ని అంగీకరించాడు.

దీంతో ఒక్కసారిగా ప్రయాగరాజ్ ప్రాంతం ఉలిక్కిపడింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube