దారుణం : వ్యక్తి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం సైకిల్ పైనే తీసుకెళ్లిన యువకుడు...

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తే హృదయ విదారకం కలగక మానదు.తాజాగా రైల్వే స్టేషన్లో హమాలీగా పనిచేసే ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందగా అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

 Men Dead Body, Lock Down Effect, Corona, Kamareddy Local News, Kamareddy Crime N-TeluguStop.com

దాంతో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లెందుకు సహాయం చేయండని ఎంతమందిని అర్తించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి తానే తన సైకిల్ పై మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే మహారాజు లింగ రాజు అనే వ్యక్తి కామారెడ్డి రైల్వే స్టేషన్ లో హమాలీగా పని చేస్తున్నాడు.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో లింగరాజు తన సొంత గ్రామానికి వెళ్ళ లేక పోయాడు.దీంతో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అన్నం పెడితే తింటూ అక్కడే తల దాచుకునేవాడు.

అయితే ఇటీవలే లింగరాజు అనారోగ్యంతో మృతి చెందాడు.

ఇది గమనించినటువంటి స్థానికులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లెందుకు సహాయం చేయాలని చుట్టుపక్కల వారిని అడిగినప్పటికీ సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.దీంతో పోలీసులు చేసేదేమీలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇది గమనించినటువంటి రాజు అనే వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు ముందుకు వచ్చాడు.అయితే మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు తన వద్ద ఎటువంటి వాహనం లేకపోవడంతో తనకు సహాయం చేయాలని ఇతరులను అడిగాడు.

కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో శవాన్ని మూటగట్టుకొని తన వద్ద ఉన్నటువంటి సైకిల్ పై ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఈ సంఘటన స్థానికంగా ఉంటున్న వారిని కలచి వేసింది.

అయితే మరికొందరు మాత్రం యువకుడు రాజు చేసినటువంటి ఈ పనికి అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube