అమానుషం: కుక్కపై ప్రతాపం చూపిస్తున్న మానవ మృగం... వీరిని ఏమనాలో మీరే చెప్పండి?

ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన జంతువు ఏందంటే అది మనుషులే అని చెప్పుకోవాలి.మనుషులు తన క్రూరత్యాన్ని తెలియజేసేటువంటి ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువైపోయాయి.

 Men Brutally Thrasing A Dog With Sticks Viral Details, Dig, Viral Latest, News V-TeluguStop.com

అలాంటి ఘటనలు చూసినప్పుడల్లా మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోయిందేమో అని అనిపంచక మానదు.ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని వారికి ఏదైనా అపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవారు మనుషులు.

ఇక ప్రమాదంలో ఉన్నది ఎవరో అనేది విషయం కూడా తెలియకపోయినా ఇక వారికి సహాయం చేసేందుకు ముందడుగు వేసేవారు.

 Men Brutally Thrasing A Dog With Sticks Viral Details, Dig, Viral Latest, News V-TeluguStop.com

కానీ ఈమధ్య కాలంలో సహాయం చేయడం మాట దేవుడు ఎరుగు కానీ సాటి మనుషుల విషయంలో కూడా ఎంతో కర్కశంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

చిన్నచిన్న కారణాలకే మానవత్వాన్ని మరిచిపోయి ఇక విచక్షణ కోల్పోతున్న మనుషులు ఏకంగా ఉన్మాదంతో దారుణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.కేవలం సాటి మనుషుల విషయంలోనే కాదు అటు మూగజీవాల విషయంలో కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు మనుషులు.

అభం శుభం తెలియని మూగజీవాల ప్రాణాలు తీసేస్తున్నారు.

ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.రోడ్డుపై పోతుంటే తమను చూసి మొరిగింది అన్న ఒక్క కారణంతో ఓ శునకంపై దారుణానికి తెగబడ్డారు ఇద్దరు యువకులు.దాని మెడకు ఉన్నా చైన్తో ముందు కాళ్ళని కట్టేసి పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా చితకబాదారు.

దీంతో బాధతో ఆ కుక్క మూలుగుతున్న చుట్టుపక్కల వారు వీరిని ఆపేందుకు ప్రయత్నించిన ఈ మూర్ఖులు మాత్రం వెనక్కి తగ్గలేదు.ఇంతలో ఆ శునకానికి సంబంధించిన ఓనర్ అక్కడికి చేరుకొని నిలదీయడంతో ఇక ఆ ఇద్దరు యువకులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా ఈ ఘటన ఈస్ట్ బెంగళూరు కె ఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ లేఅవుట్లో వెలుగులోకి వచ్చింది.

Video : Men Brutally Thrasing A Dog With Sticks Viral Details, Dig, Viral Latest, News Viral, Latest News, Social Media, Man, Humanity , Thrashing Dog, East Bangalor, Kr Puram Police Station, #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube