తన ప్రియురాలు మరో వ్యక్తితో  చనువుగా ఉంటోందని... ప్రియుడు ఏకంగా...

ఈ మధ్య కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలతో ఇతరుల జీవితాల్లో తీవ్ర విషాదం నిండుతోంది.కాగా తాజాగా ఓ యువకుడు పెళ్లయిన మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి ఆమె ఇంకో వ్యక్తితో చనువుగా ఉంటుందని అనుమానించి దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగుచూసింది.

 Men Brutally Killed Married Women For Extramarital Affairs-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన భువనగిరి జిల్లాలో కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్ నగరంలో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో లక్ష్మి అనే మహిళ తో పరిచయం ఏర్పడింది.అయితే అప్పటికే లక్ష్మి భర్త మరణించి కొన్ని సంవత్సరాలు కావడంతో కుమార్ తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది.

 Men Brutally Killed Married Women For Extramarital Affairs-తన ప్రియురాలు మరో వ్యక్తితో  చనువుగా ఉంటోందని… ప్రియుడు ఏకంగా…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 కాగా ఈ మధ్య కాలంలో లక్ష్మి స్థానికంగా ఉన్నటువంటి మరో యువకుడితో చనువుగా ఉంటోంది.దీంతో కుమార్ లక్ష్మి పై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో తాజాగా మరోమారు ఈ విషయంపై ఇద్దరి మధ్య  గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో తీవ్ర ఆవేశానికి లోనయినటువంటి కుమార్ లక్ష్మి ని దారుణంగా హతమార్చాడు.

 అనంతరం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగి పోయాడు.నిందితుడు తెలిపిన వివరాల మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

#Telangana #Married Women #MenBrutally #MenBrutally

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు