భర్త పాలు పోసేందుకు బయటికి వెళ్ళగానే భార్య ప్రియుడితో బెడ్ రూమ్ లో....

ఈ మధ్య కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా లేనిపోని అనుమానాలకు కారణంగా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.కాగా తాజాగా ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పుదుచ్చేరి పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

 Men Brutally Killed His Wife For Extra Marital Affair In Puducherry, Men Brutall-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో రుతిక అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.ఈ క్రమంలో రుతిక  భర్త కుటుంబ పోషణ నిమిత్తమై పాల వ్యాపారం చేసేవాడు.

దీంతో అర్ధ రాత్రి సమయంలో రుతిక భర్త వ్యాపార నిమిత్తమై బయటకి వెళ్లి మరుసటి రోజు మధ్యాహ్నం 12 లేదా 1:00 సమయంలో ఇంటికి వచ్చేవాడు.అయితే ఈ మధ్య కాలంలో రుతిక స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానాలు ఆమె భర్తకి మొదలయ్యాయి.

ఈ క్రమంలో తరచూ వీరిద్దరూ గొడవ పడేవారు.దీనికితోడు రుతిక భర్త వ్యాపార నిమిత్తమై బయటికి వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో తన భార్య అందంగా ముస్తాబువ్వడం మరియు ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించడం వంటి వాటి కారణంగా రుతిక  భర్తకి అనుమానాలు మరింత బలమయ్యాయి.

దీంతో మరోమారు ఇద్దరు భార్యాభర్తలు ఈ విషయంపై గొడవ పడ్డారు.ఈ క్రమంలో క్షణికావేశంలో విచక్షణ కోల్పోయినటువంటి ఆమె భర్త చేతికందిన రాయితో రుతిక తలపై దారుణంగా దాడి చేశాడు.

దీంతో తీవ్ర రక్త స్రావానికి గురయినటువంటి రుతిక అక్కడికక్కడే మృతి చెందింది.ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు.అలాగే మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube