తన లవర్ వేరే పెళ్లి చేసుకున్నా పర్లేదు నాతో వచ్చేయమన్న ప్రియుడు... కానీ చివరికి....

ఈ మధ్య కాలంలో కొందరు యువకులు ప్రేమ పేరుతో చేసేటటువంటి అరాచకాలకు ఆడపిల్లలు అన్యాయంగా బలవుతున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని తెలిసి రివాల్వర్ తో దారుణంగా కాల్చి హత్య చేసిన ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

 Men Brutally Killed His Lover For Marriage-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన నలంద జిల్లా పరిసర ప్రాంతంలో “రేహాన్” అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే రేహాన్ గత కొద్దికాలంగా స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

 దీంతో ఇటీవలే ఆ యువతికి తన ప్రేమని తెలియజేశాడు.అయితే ఆ యువతికి కూడా రేహాన్ అంటే ఇష్టం ఉండడంతో వెంటనే ప్రేమని అంగీకరించింది.

 Men Brutally Killed His Lover For Marriage-తన లవర్ వేరే పెళ్లి చేసుకున్నా పర్లేదు నాతో వచ్చేయమన్న ప్రియుడు… కానీ చివరికి….-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో వీరిద్దరూ ఎక్కడికెళ్ళినా చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాళ్ళు.ఈ   క్రమంలో వ్వెరిద్దరి ప్రేమ విషయం ఇతరుల ద్వారా యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వేరే యువకుడితో ఆమెకు పెళ్ళి నిశ్చయించారు.

దీంతో రేహాన్ తన ప్రియురాలిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశాడు.

అయినప్పటికీ యువతి కుటుంబ సభ్యులు అడ్డు పడడంతో చివరికి పెళ్లి రోజున యువతిని కళ్యాణ మండపానికి తీసుకెళుతున్న సమయంలో వారి కారుని ఆపి రేహాన్ అడ్డగించాడు.అనంతరం తన ప్రియురాలిని తన వెంట రమ్మని కోరాడు.కానీ తన ప్రియురాలు తన వెంట రావడానికి నిరాకరించడంతో వెంటనే తన తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తీసి దారుణంగా కాల్పులు జరిపాడు.

దీంతో తన ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు అనంతరం రేహాన్ ని అదుపులోకి తీసుకొని విచారించారు.

#MenBrutally #MenBrutally #Bihar #Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు