కూతురు వేరే కులస్థుడిని ప్రేమించిందని తండ్రి ఏకంగా ఆమె తల ని....

ప్రస్తుత కాలంలో కొందరు కొందరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన కూతురు వేరే కులస్తుడని ప్రేమించిందని ఆమెను దారుణంగా హతమార్చి చివరికి పోలీసులకు లొంగిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Men Brutally Killed His Daughter For She Is Love Affair With Inter Cast Boy-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన పండేతర అనే గ్రామంలో సర్వేశ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఇతడికి 17 సంవత్సరాలు కలిగిన ఒక కూతురు ఉంది.

అయితే సర్వేశ్ కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా సర్వేష్ కూతురు స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో చనువుగా ఉంటోంది.

 Men Brutally Killed His Daughter For She Is Love Affair With Inter Cast Boy-కూతురు వేరే కులస్థుడిని ప్రేమించిందని తండ్రి ఏకంగా ఆమె తల ని….-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో యువతి ఆ యువకుడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం కొందరు చూసి సర్వేశ్ కి సమాచారం అందించారు.దీంతో సర్వేశ్ పలుమార్లు తన కూతురిని ఈ విషయంపై మందలించాడు.

అయినప్పటికీ యువతి తన తండ్రి మాటలు పెడచెవిన పెట్టింది.

దీంతో మరోమారు యువతి తన ప్రియుడితో కలిసి తిరగడం సర్వేశ్ గమనించాడు.

 దీంతో సర్వేశ్ ఆవేశంతో రగిలి పోయి కన్న కూతురనే విషయం కూడా మర్చిపోయి యువతిని దారుణంగా హతమార్చాడు. అనంతరం యువతి తలని మొండెం నుంచి వేరు చేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.

 అంతేకాక తన కూతురు వేరే కులస్తుడిని  ప్రేమించినందువల్ల తానే హతమార్చానని వాంగ్మూలం కూడా ఇచ్చాడు.దీంతో నిందితుడు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

#MenKilled #MenBrutally #LoveAffair #MenBrutally #Utter Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు