అబ్బాయిలతో చాటింగ్ చేయొద్దని ఎంత చెప్పినా చెల్లెలు వినకపోవడంతో అన్న ఏకంగా...- Men Brutally Killed Her Sister For No Chatting With Boys

Men Brutally killed her Sister For No chatting with Boys, Crime news, Delhi, Social media, Brother Killdee sister, - Telugu Brother Killdee Sister, Crime News, Delhi, Men Brutally Killed Her Sister For No Chatting With Boys, Social Media

ఈమధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా మాధ్యమాలకు బానిసలై నిత్యం సెల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారు… అయితే తాజాగా 16 సంవత్సరాలు కలిగిన ఓ యువతి ఎంత చెప్పినా సోషల్ మీడియా మాధ్యమాలలో చాటింగ్ చేయడం మానకపోవడంతో చివరికి తన అన్నయ్య దారుణంగా కాల్చి చంపిన ఘటన ఢిల్లీ నగర పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

 Men Brutally Killed Her Sister For No Chatting With Boys-TeluguStop.com

వివరాల్లోకి వెళితే సంధ్య (పేరు మార్చాం) అనే ఓ 16 సంవత్సరాలు కలిగిన యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ నగర పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలవులు కావడంతో కాలేజీ కి వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలను అబ్బాయిలతో చాటింగ్ చేసేది.

 Men Brutally Killed Her Sister For No Chatting With Boys-అబ్బాయిలతో చాటింగ్ చేయొద్దని ఎంత చెప్పినా చెల్లెలు వినకపోవడంతో అన్న ఏకంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 ఈ విషయాన్ని గమనించిన సంధ్య అన్నయ్య సోషల్ మీడియాలో మగవాళ్ళతో చాటింగ్ చేయొద్దని పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ సంధ్య  తన అన్నయ్య మాటలను పెడచెవిన పెడుతూ ఉండేది.

ఈ క్రమంలో మరోమారు సంధ్య తన అన్నయ్యకు సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో సంధ్యపై కాల్పులు జరిపాడు.

దీంతో కాల్పుల శబ్దం విన్నటువంటి కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

#BrotherKilldee #Delhi #Social Media #MenBrutally

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు