గర్ల్ ఫ్రెండ్ కోరిందని వాట్సాప్ వీడియో కాల్ లో నగ్నంగా ...... చివరికి

ప్రస్తుత కాలంలో కొందరు ఆన్ లైన్ లో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పరిచయమైన మహిళల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు.తాజాగా  ఫేస్ బుక్  ద్వారా పరిచయమైన మహిళతో మాట్లాడాలని ఏకంగా వాట్సాప్ నంబర్ తీసుకొని నగ్నంగా చాటింగ్ చేసినటువంటి యువకుడు చివరకు డబ్బులు ఇవ్వకపోతే ఆ మహిళ తన నగ్న చాటింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నట్లు ఇటీవలే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఫిర్యాదు చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో వెలుగుచూసింది.

 Women Blackmailing, Hyderabad, Crime News,  Telangana, Whats App Trap-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక నగర పరిసర ప్రాంతంలో 23 సంవత్సరాల కలిగినటువంటి ఓ యువకుడు నివాసముంటున్నాడు.అయితే ప్రస్తుతం పని లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటూ సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.

ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలలో గుర్తుతెలియని మహిళతో పరిచయం ఏర్పడి ఈ పరిచయం కాస్త ప్రేమ కి దారి తీసింది.దీంతో ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకొని కొంతకాలం పాటు చాటింగ్ కూడా చేశారు.

అయితే ఈ క్రమంలో మహిళ తనకి యువకుడిని చూడాలని ఉందంటూ వీడియో కాల్ చేసి నగ్నంగా కనిపించాలని అడిగింది.

దాంతో యువకుడు ఏమి ఆలోచించకుండా నగ్నంగా తన ఫోటోలను మరియు వీడియో కాల్ చేశాడు.

ఇదే అదునుగా చేసుకున్న మహిళ తనకు డబ్బులు ఇవ్వకపోతే తన నగ్న వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తానని కాబట్టి  తనకు 50 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది.దీంతో భయపడిన యువకుడు తన వద్ద ఉన్నటువంటి 20 వేల రూపాయలను మహిళ బ్యాంక్ ఖాతా కి బదిలీ చేసినప్పటికీ మరింత కావాలని డిమాండ్ చేయడంతో యువకుడు తన బంధువుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో బాధితులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అంతేగాక గుర్తు తెలియని మహిళలు, లేదా యువతులతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడినప్పుడు కొంతమేర జాగ్రత్తగా ఉండాలని లేకపోతే భవిష్యత్తులో పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube