తనని పెళ్లి చేసుకోకపోతే ఆ ఫోటోలను ఇంటర్ నెట్లో పెడతానంటు యువతిని…  

Men Blackmail His Girlfriend For Marriage - Telugu Blackmail, Crime News, Girl Friend, Love Affair, Marriage, Punjab

ప్రస్తుత కాలంలో కొందరు యువతులు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకునే కేటుగాళ్ల వలలో చిక్కి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.తాజాగా ఓ యువతిని ప్రేమ పేరుతో ఓ యువకుడు లొంగతీసుకుని చివరికి తనని పెళ్లి చేసుకోకపోతే ఏకాంత సమయంలో సన్నిహితంగా దిగినటువంటి ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేసి కటకటాల పాలైన ఘటన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Men Blackmail His Girlfriend For Marriage

వివరాల్లోకి వెళితే పంజాబ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఓ యువతి నివాసం ఉంటోంది.అయితే ఈమె కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

కాగా ఇదే సంస్థలో పని చేస్తున్నటువంటి ఉద్యోగితో ప్రేమలో పడింది.దీంతో వీళ్ళు ఎక్కడికెళ్ళినా చెట్టాపట్టాలేసుకుని తిరిగే వాళ్ళు.

తనని పెళ్లి చేసుకోకపోతే ఆ ఫోటోలను ఇంటర్ నెట్లో పెడతానంటు యువతిని…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఆ ఉద్యోగికి అంతకుముందే అక్రమ సంబంధాలు ఉన్నాయని గుర్తించింది.దీంతో యువకుడిని ఈ విషయంపై పలుమార్లు నిలదీసింది.

అయినప్పటికీ ఈ యువకుడు తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో యువతి అతడితో ప్రేమ బంధాన్ని తెంచుకోవాలని అనుకుంది.  దీంతో యువకుడు తనని పెళ్లి చేసుకోకపోతే ఏకాంత సమయంలో సన్నిహితంగా దిగినటువంటి ఫోటోలని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తానని బెదిరించ సాగాడు.

దీంతో భయపడినటువంటి యువతి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించి యువకుడి పై ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు యువకుడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Men Blackmail His Girlfriend For Marriage Related Telugu News,Photos/Pics,Images..