ఆ విషయంలో ఆడవారి కన్నా మగవారే నయం

మనం సాధారణంగా చూస్తుంటాం, ఏదైనా ఫంక్షన్ లో ఒక అమ్మాయి తమ కన్నా మంచి డ్రెస్ వేసుకోని వచ్చినా, నగ ఆకర్షణీయంగా ఉన్నా సరే, దాన్ని ఒప్పుకొవడం పక్కనపెట్టి రకరకాల వంకలు పెడుతుంటారు అమ్మాయిలు.స్కూల్లో ఆయనా, కాలేజిలో అయినా, తమకన్న అందంగా ఉన్నా అమ్మాయిల పట్ల, తనకన్నా బాగా చదువుతున్న అమ్మాయిల పట్ల ఓరకమైన అభద్రతభావం, అసూయ లాంటి లక్షణాలు కనబడుతుంటాయి అమ్మాయిల్లో.

 Men Behave More Friendly With Competitors – Study-TeluguStop.com

తమతో ఏ విషయంలో అయినా గట్టిగా పోటిపడే అమ్మాయిల పట్ల సద్భావాన అమ్మాయిల్లో ఉండటం కష్టం అని హార్వర్డు పరిశోధకులు చెబుతున్నారు.

ఇందుకు పూర్తి భిన్నంగా, పోటిలో ఓడినా, గెలిచినా, పోటిదారులపైన ఓరకమైన గౌరవం, లేదా జాలి చూపడం మగవారి అలవాటు అని పరిశోధకులు చెప్పుకొచ్చారు.

అయితే పోటిపడుతున్న సమయంలో మాత్రం మగవారిలో ఉన్నంత క్రూరత్వం కాని, నిర్దాక్షిణ్యత కాని ఆడవారి ఉండవట.కాని, పోటి ముగిసాక మాత్రం మగవారిలో కనబడే గౌరవం, సద్భావాన చాలా తక్కువమంది ఆడవారిలో కనబడతాయని హార్వర్డు స్టడి రిపోర్టు చేసింది.ఈ స్టడి కోసం రకరకాల ఆటలలో గెలుపోటములు తరువాత మహిళలు, పురుషులు తమ పోటీదారులతో వ్యవహరించిన తీరుని గమనించి పోటితత్వంలో మగవారి ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆడవారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక అంచనాకి వచ్చారు పరిశోధకులు.

“బాక్సింగ్ లాంటి క్రీడల్లో దాదాపుగా ఒకరిని ఒకరు చంపుకునేంతగా పోటిపడతారు.అయినా మగవారు పోటి ముగిసాక, తమ పోటిదారుడి వెన్నితట్టడం, ఆలింగనం చేసుకోవడం, తనతో కాసేపు మాట్లాడటం ఎక్కువగా గమనించాం.ఇది ఆడవారిలో తక్కువగా కనిపించింది.మిగితా క్రీడల్లోనూ అంతే” అంటూ బెనిన్సన్ అనే పరిశోధకుడు చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube