పని మనిషి పై కన్నేసిన ఇంటి యజమాని.. దాంతో ఏకంగా....

ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ ఇతరుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు.  కాగా తాజాగా పని చేయడానికి ఇంటికి వచ్చిన పని మనిషిపై ఓ యజమాని కన్నేసి ఆమెన్ లొంగదీసుకోవడానికి తన భర్త అడ్డు వస్తున్నాడని అతడిని సైతం హతమార్చడానికి యజమాని  సిద్దమై చివరికి పోలీసులకు చిక్కిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Men Arrested In Vijayawada For Women Harassments, Vijayawada, Crime News, Men Ar-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో సుబ్బారావు అనే ఓ  వ్యక్తి నివాసముంటున్నాడు. కాగా  పలు వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా సుబ్బారావు ఒంటరిగా ఉంటున్నాడు.

 అయితే ఇటీవలే సుబ్బారావు ఇంట్లో పని చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి ఓ వివాహిత చేరింది. దీంతో గత కొద్ది కాలంగా ఒంటరిగా ఉంటున్న సుబ్బారావు ఆమెపై మనసు పడ్డాడు.

 ఈ క్రమంలో సుబ్బారావు తన కోరిక తీర్చాలంటూ పని మనిషిని కోరాడు.

అంతేగాక తన కోరిక తీరిస్తే కావలసినంత డబ్బు కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.

 కానీ వివాహిత మాత్రం అందుకు ఒప్పుకోలేదు.  అంతేగాక ఇలాంటి విషయాలు తన భర్తకు తెలిస్తే తన కాపురం కూలిపోతుందని ఎంత చెప్పినప్పటికీ సుబ్బారావు మాత్రం వినలేదు.

 దీంతో సుబ్బారావు వివాహిత భర్తను హతమార్చేందుకు పన్నాగం పన్నాడు. ఇందులోభాగంగా స్థానికంగా ఉన్నటువంటి డబ్బులు తీసుకొని హత్యలు చేసేటువంటి వారిని సంప్రదించి తన ఇంట్లో పని చేస్తున్న వివాహిత భర్తని హతమార్చాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అనుకున్న విధంగానే నిందితులు వివాహిత భర్తను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి  దాడి చేస్తుండగా వివాహిత భర్త కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు వచ్చి వివాహిత భర్తను కాపాడారు.  దీంతో నిందితులు అటు నుంచి అటే పరారయ్యారు.

 అనంతరం బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. ఈ క్రమంలో నిందితులు సుబ్బారావు పేరు చెప్పడంతో సుబ్బారావు ని కూడా అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube