భార్యపై కోపాన్ని అత్తపై చూపించిన అల్లుడు ... ఏం చేశాడంటే....?

ప్రస్తుతం కొందరు వ్యక్తులు క్షణికావేశానికి లోనై ఏకంగా మనషుల ప్రాణాలనే తీసేస్తున్నారు.దీంతో తామ అనుకునే వాళ్ళ జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నారు  తాజాగా ఓ వ్యక్తి  తన భార్యతో పడినటువంటి గొడవ కారణంగా తన అత్త పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Men Arrested In Nellore For The Murder Attempt On His Mother In Law-TeluguStop.com

వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన టువంటి గ్రామంలో  వెంకటరమణ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో అతడి భార్యకి కొంత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె తన భర్తతో కలిసి తన పుట్టింటికి వచ్చింది.

నిన్నటి రోజున రాత్రి భోజనం చేసిన తర్వాత వెంకటరమణ తన భార్యతో గొడవ పడ్డాడు.ఈ క్రమంలో భార్య తల్లి అయిన లక్ష్మమ్మ ఎందుకు అనవసరంగా తన కూతురుతో గొడవ పడుతున్నావ్ అంటూ వెంకటరమణ ని నిలదీసింది.

దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.ఈ గొడవ కారణంగా వెంకటరమణ తీవ్ర ఆగ్రహానికి గురై తన బైక్ లో ఉన్నటువంటి పెట్రోలు తీసుకొచ్చి లక్ష్మమ్మ పై పోసి నిప్పంటించాడు.

Telugu Nellore, Nellore Latest-Telugu Crime News(క్రైమ్ వార్

దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు వచ్చి మంటలను ఆర్పి ఆమెను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించారు.అయితే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి లక్ష్మమ్మ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube